Kids Screen Time: పిల్లలు స్మార్ట్ ఫోన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావద్దంటే ఇలా చేయండి!

పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ లోని గేమ్స్ లో, యూట్యూబ్ వీడియోల్లో మునిగి తేలుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 07:00 AM IST

పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ లోని గేమ్స్ లో, యూట్యూబ్ వీడియోల్లో మునిగి తేలుతున్నారు. ఈక్రమంలో పిల్లలకు ఫోన్ అడిక్షన్ నుంచి రక్షణ కల్పించే మార్గాలు ఏంటో తెలియక పేరెంట్స్ సతమతం అవుతున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే కొన్ని సూచనలను మానసిక వైద్య నిపుణులు ఇస్తున్నారు. వాటి వివరాలతో ప్రత్యేక కథనం..

పెద్దల చేతిలో ఎప్పుడూ టీవీ రిమోట్, ఫోన్, ల్యాప్ టాప్ ఉంటే అది చూసిన పిల్లలు దాన్నే ఫాలో అయిపోతారు. కుటుంబ సభ్యులంతా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే పిల్లల్లో కూడా పుస్తకాలు చదివే అలవాటు వస్తుంది. గతంలో అమ్మమ్మలు, నానమ్మలు తమ మనవళ్ళు, మనవరాళ్లను చుట్టూ కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా.. ఫోన్ లో పిల్లల గేమ్స్ పెట్టి గ్రాండ్ చిల్డ్రెన్స్ చేతిలో పెడుతున్నారు. ఈవిధంగా పిల్లల ఫోన్ అడిక్షన్ కు బాటలు పడుతున్నాయి.

స్క్రీన్ టైం ఇలా తగ్గిద్దాం..

* స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కు పిల్లలు
అత్తుకుపోయే టైమ్ ను తగ్గించేందుకు తల్లిదండ్రులకు ఒక ప్రణాళిక అవసరం.
* ముందుగా తల్లిదండ్రులు, ఇంట్లోని ఇతర పెద్దలు మారాలి.
* పెద్దలు స్మార్ట్ ఫోన్ చూసే టైం ను తగ్గించుకోవాలి. వాళ్ళను చూసి పిల్లలు కూడా క్రమంగా మారుతారు.
* ఇండోర్ గేమ్స్ ను క్రమంగా అలవాటు చేయటంపై ఫోకస్ పెట్టండి.
* పిల్లలతో ఆడటాన్ని పెద్దలు వ్యాపకంగా పెట్టుకోవాలి.
* వీలైతే కాసేపు వైఫై నియంత్రణ మీ చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆఫ్ చేస్తూ, పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చర్యలు తీసుకోండి.
* స్క్రీన్ డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లేవరకు పరిస్థితి తెచ్చుకోకుండా మీకు మీరే స్వయం నియంత్రణా విధానాన్ని అలవాటు చేసుకుంటే అది పిల్లల్లోనూ మార్పు తెస్తుంది.

18 గంటలపాటు రూములో..

రేయింబవళ్లు సోషల్ మీడియాలో నిమగ్నమైన టీనేజర్లు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకు ఒక దశలో తెలియడం లేదట. ఇలాంటి వారిలో ఓ బాలుడు ఏకంగా 18 గంటలపాటు రూములో తాళం వేసుకుని కంటిన్యూగా వీడియో గేమ్ ఆడాడడని ఇటీవల ఇండియా లో నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు.