Armpits Lightening Tips: చంకల్లో నలుపు ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా శరీరం ఎంత తెల్లగా ఉన్నప్పటికీ శరీర భాగాల్లో ఒకటైన చంక భాగంలో నల్లగా ఉంటుంది. ఈ విషయం గురించి అబ్బాయిలు అంతగా పట్టించుకోక పోయి

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 10:00 PM IST

మామూలుగా శరీరం ఎంత తెల్లగా ఉన్నప్పటికీ శరీర భాగాల్లో ఒకటైన చంక భాగంలో నల్లగా ఉంటుంది. ఈ విషయం గురించి అబ్బాయిలు అంతగా పట్టించుకోక పోయినప్పటికీ అమ్మాయిలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. చంకల్లో నలుపుదనం సమస్యను పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా చంకల్లో నలుపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా, 2 టీ స్పూన్ల నిమ్మ రసం, 2 టీ స్పూన్ల సహజమైన చెరకు రసాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. పైన బబుల్స్ వచ్చే వరకు ఒక స్పూన్‌తో మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని చంకలకు పట్టించాలి. ఓ పది నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో వాష్ చేయాలి.

స్కిన్‌పై ఉండే డెడ్ సెల్స్‌ను తొలగించే శక్తి బేకింగ్ సోడా, లెమన్, చెరకుకి ఉంది. అయితే మీరు చంకల్లో హెయిర్ తీసిన వెనువెంటనే ఈ ప్రాసెస్ చేయకూడదు. ఇక కొంతమంది చర్మతత్వానికి బేకింగ్ సోడా సరిపడదు. అందుకే ముందుగా లైట్‌గా అప్లయ్ చేసి చూడండి. చర్మం ఎర్రగా కందినట్టు అనిపిస్తే ఈ మిశ్రమాన్ని అప్లయ్ చేయకపోవడం ఉత్తమం. మరో రెమిడి విషయానికి వస్తే.. 2 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ లేదా చక్కెరను ఒక గిన్నెలో పోసి ఇందులో ఒక నిమ్మ చెక్క జ్యూస్ తీసి మిక్స్ చేయాలి. పది హేను నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్‌కి అప్లయ్ చేసి మరో పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ బ్రౌన్ షుగర్, లెమన్ కాంబో చంక్లలో నల్లదనాన్ని తగ్గించడంతో పాటు బ్యాక్టీరియానూ నిర్మూలిస్తుంది. అలాగే పెరుగును ప్రతి రోజూ చంకల్లో అప్లయ్ చేసుకుంటే నలుపు రంగ సమస్య ఉండనే ఉండదు.

చర్మాన్ని సున్నితంగా మార్చే శక్తి కూడా పెరుగులోని విటమిన్ ఎ కి ఉంది. పెరుగులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ తత్వం చర్మంపై ఉండే బ్యాక్టీరియాను అరికడుతుంది. ఇక కలబంద ముక్కను కట్ చేసి అందులోని జెల్ వంటి పదార్థాన్ని తీసుకుని చంక్లలో అప్లయ్ చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కీరదోస కాయను సన్నగా స్లైసెస్‌ గా తరగాలి. ఆ ముక్కలతో చంకల్లో రబ్ చేయాలి. రోజూ స్నానం చేసే ముందు ఇలా చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అలాగే కీరా దోస కాయ, బంగాళదుంపలను పేస్ట్‌గా తయారు చేసి చంకల్లో రాసుకుని పావు గంట పాటు ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే నలుపు పోతుంది. ఇక నిమ్మకాయ గుజ్జుతో అండర్ ఆర్మ్స్‌ను క్లీన్ చేస్తే అక్కడ తెల్లగా మారుతుంది