Concentration : ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏం చేయాలి?

ఏకాగ్రతను పెంచుకోవడానికి కొన్ని పనులను చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

  • Written By:
  • Updated On - February 3, 2024 / 09:16 AM IST

ఏకాగ్రత(Concentration) ఉంటేనే మనం ఏ పనిని అయినా తొందరగా చేయగలుగుతాము. ఏకాగ్రత వలన మనం చేసే పనిలో విజయాన్ని సాధించగలుగుతాము. కాబట్టి ఏకాగ్రతను పెంచుకోవడానికి కొన్ని పనులను చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

*మనం ప్రతి రోజు ఉదయం సమయంలో ధ్యానం చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది.
*మనం ఏకాగ్రత పెంచుకోవడానికి పని చేసే సమయంలో మధ్యలో కొంత సమయం బ్రేక్ తీసుకోవాలి.
*మనం ప్రతి రోజు ఏడు లేదా ఎనిమిది గంటల సమయం నిద్ర పోవాలి. మనం నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించాలి లేకపోతే మనలో ఏకాగ్రత దెబ్బ తింటుంది.
*ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం వలన ఏకాగ్రత పెరుగుతుంది.
*వ్యాయామాలు చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వలన కూడా మనలో ఏకాగ్రత పెరుగుతుంది.
*మనం ఒకసారి ఏదయినా ఒక పనిని మాత్రమే చేయాలి. ఒకేసారి వివిధ రకాల పనులు చేస్తే మనం చేసే పనిలో ఏకాగ్రత తగ్గుతుంది.
*మనం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని రీచ్ అవుతుండాలి. ఇలా చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది.
*ఎవరైనా ఏదయినా విషయాన్ని చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి. వినడం వలన మనకు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. వినడం వలన పనిలో ఏకాగ్రత పెరుగుతుంది.

 

Also Read : Cervical Cancer: గ‌ర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది..? భారతదేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా..?