Site icon HashtagU Telugu

Hair Growth: పొడవాటి దట్టమైన జుట్టు కావాలి అంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే?

Mixcollage 19 Jan 2024 08 19 Pm 4499

Mixcollage 19 Jan 2024 08 19 Pm 4499

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు ప్రధాన సమస్యలుగా మారిపోయాయి. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, తెల్ల వెంట్రుకలు చుండ్రు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటి కారణంగా చాలామంది ఎక్కువ మొత్తంలో జుట్టుని కోల్పోతూ ఉంటారు. దీంతో జుట్టును మళ్ళీ తిరిగి రప్పించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. కానీ కేవలం మంచి మంచి ఆహార పదార్థాలు తినడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుందని మీకు తెలుసా.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఇంట్లో దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలతోనే ఒత్తైనా పొడవాటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫోన్ వాడకాన్ని తాగించాలి. ఫోన్ ఎక్కువగా వాడితే దానిలోనుంచి వచ్చే బ్లూ లైట్ మన జుట్టు కుదుళ్ళని బలహీనపరుస్తుంది. అలాకాకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఫోన్ వాడకుండా చూడాలి. జుట్టు పెరుగుదలలో మెగ్నీషియం కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బాదం, అరటిపండ్లు, పాలకూరలు తీసుకోవాలి. జుట్టు పెరుగుదలకి విటమిన్ డి ముఖ్య పోషకం.

అందుకే, పాలు, గడ్లు, చీజ్, పుట్ట గొడుగులు వంటి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకుంటే జుట్టు పెరుగుతుంది. ఈ ఆహార పదార్థాలను తినడంతో పాటుగా నిపుణుల సలహా లేకుండా జుట్టుకు ఏవి పడితే అవి షాంపూలు ఆయిల్స్ ని ఉపయోగించడం అంత మంచిది కాదు. జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి.