Site icon HashtagU Telugu

Blackness: ఎండల కారణంగా స్కిన్ నల్లగా మారుతోందా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే చాలు!

Blackness

Blackness

వేసవికాలంలో చాలా మందికి ఎదురయ్యే సమస్యల్లో చర్మం కందిపోయి నల్లగా మారే సమస్య కూడా ఒకటి. విపరీతమైన ఎండల కారణంగా చర్మం డల్ గా అయిపోయి నల్లగా మారుతూ ఉంటుంది. అందుకే బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోమని చెబుతూ ఉంటారు. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం తగ్గుతుందని చెబుతుంటారు. అలాగేఎండ కారణంగా చర్మం నల్లగా మారకుండా ఉండడానికి పండ్లు ఎంతో బాగా ఉపయోగపడతాయట. ముఖ్యంగా స్ట్రాబెర్రీ, దానిమ్మ, జామ వంటి పండ్లలో ఉండే పోషకాలు ఇందుకు బాగా సహాయపడతాయని చెబుతున్నారు.

దానిమ్మలో పుష్కలంగా లభించే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు శరీరంపై పడకుండా అడ్డుకుంటుందట. అలాగే చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందట. స్ట్రాబెర్రీలో అధికంగా లభించే విటమిన్ సి కూడా ఈ సమస్య దరిచేరకుండా కాపాడుతుందట. అలాగే బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటివి కూడా ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా ఏ కాలంలోనైనా లభించే జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు చర్మ క్యాన్సర్, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతాయట. వీటితో పాటు కివీ, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్లు కూడా చర్మానికి ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.

అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు తరచుగా గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. దీనివల్ల అందులో ఉండే పోషకాలు ఆరోగ్యం, ఫిట్​నెస్​ పరంగా దోహదం చేయడంతో పాటు ఎండ నుంచి చర్మానికి తగిన రక్షణ సైతం కల్పిస్తాయట. ముఖ్యంగా గ్రీన్​ టీలో ఉండే ట్యానికామ్లం, ఇతర సమ్మేళనాలు ఎండ కారణంగా చర్మం కందిపోకుండా కాపాడతాయని చెబుతున్నారు. చర్మాన్ని రక్షించుకోవడం కోసం కొద్దిగా ఆలివ్ నూనెలో పావు కప్పు టమాటా పేస్ట్​ ను కలుపుకొని రోజూ తీసుకోవడం వల్ల ఎండ వల్ల చర్మం నల్లగా మారకుండా జాగ్రత్తపడచ్చట. టమాటాలో ఎక్కువగా లభించే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి అధిక సమయం రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. చాలా మందికి ఆలూతో చేసిన వంటకాలంటే ఇష్టం. అయితే ఆలూ సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడడంలో బాగా ఉపయోగపడుతుందట. ఇది శరీరానికి మెరుపును ఇవ్వడంలో సహయపడుతుందట. ముఖ్యంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు ఎండ వల్ల చర్మం కంది పోకుండా రక్షిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆలూను మెత్తగా చేసుకొని చర్మంపై ఎండ తగిలే ప్రదేశంలో రాస్తే సరిపోతుందని చెబుతున్నారు.