Site icon HashtagU Telugu

Beauty Tips: పాదాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే న్యాచురల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

Beauty Tips

Beauty Tips

చాలామంది స్త్రీ పురుషులకు కాళ్ల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమందికి కాళ్లు పాదాల వద్ద చీలి కొన్నిసార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రాత్రిళ్ళు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాళ్ల పగుళ్ళ సమస్యకు రకరకాల ఆయింట్మెంట్లు స్ప్రేలు, బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే అలాంటప్పుడు కొన్ని నేచురల్ టిప్స్ ని ఫాలో అయితే చాలు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసి అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా పాదాల పగుళ్ల సమస్యలు పోయి చర్మం కొమలంగా మారుతుందట. పొడిబారిన అలాగే పెలుసు బారిన చర్మానికి కొబ్బరి నూనె తగిన తేమను అందించి మృదువుగా చేస్తుందట.

తేనే కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పొడిగా మారిన పాదాలకు తేనెను అప్లై చేసి రెండు, మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉండటం వల్ల చర్మానికి తగిన తేమ అంది మృదువుగా మారతాయట.

అలాగే చర్మ సంరక్షణకు కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొంచెం కలబంద తీసుకొని పాదాలకు బాగా అప్లై చేసి ఆ తర్వాత పది నుంచి 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.

ఇవే కాకుండా స్క్రబ్​తో కూడా సమస్య తీరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అరచెంచా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ రెండు చెంచాల చొప్పున ఒక పాత్రలో తీసుకొని బాగా కలపాలని చెబుతున్నారు. అనంతరం ఈ మిశ్రమాన్ని కాళ్లు, పాదాల వద్ద పొడిగా మారిన చర్మంపై అప్లై చేసి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలని తెలిపారు. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందట.