Dandruff: చలికాలం వచ్చింది అంటే చాలు చర్మానికి సంబంధించిన చాలా రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలు చర్మ సమస్యలు పెదవులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుట్టు విషయంలో కూడా శీతాకాలంలో కొన్ని సమస్యలు తప్పవు. అలాంటి వాటిల్లో ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. ఈ కాలంలో చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. దీంతో చుండ్రు ఎక్కువగా వస్తుంది.
దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చట. చలికాలంలో సౌందర్య సంరక్షణ విషయంలో నూనెలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే కొంతమంది రాత్రివేళల్లో మాయిశ్చరైజర్ కి బదులు నూనెలను ఉపయోగిస్తుంటారు. నూనెల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కుదుళ్లను పొడిబారకుండా చేస్తాయట. దీంతో చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. దీనికోసం కొబ్బరి, బాదం, ఆలివ్ వంటి నూనెల్లో ఏదో ఒకదానితో లేదా వాటి మిశ్రమాన్ని తీసుకొని గోరువెచ్చగా వేడిచేయాలని, తర్వాత ఆ నూనెతో మాడును బాగా మర్దన చేసుకోవాలని, ఒక గంట సేపు అలా వదిలేయాలని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల కుదుళ్లు నూనెను పీల్చుకొంటాయట. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుందట. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చని చెబుతున్నారు. అయితే చలికాలంలో మనం ఉపయోగించే కొన్ని షాంపూలు కూడా చుండ్రు రావడానికి కారణమవుతాయట. కాగా శీతాకాలంలో కుదుళ్లు పొడిబారడం వల్ల చుండ్రుతో పాటు కొంతమందికి తలలో దురద ఎక్కువగా వస్తుంటుంది. దీనికి కలబంద మంచి పరిష్కారం అని చెబుతున్నారు. దీనికోసం కలబంద గుజ్జులో వేపాకుల పొడిని, కొన్ని చుక్కుల ఉసిరి నూనెను కలుపుకొని మిశ్రమంగా చేసుకోవాలట. ఇలా తయారైన మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలట.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుందట. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందట. కలబంద జెల్ యువతులలో చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందట. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్లో సైతం చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను తగ్గించే గుణాలుఉన్నాయి. ఇది కుదుళ్ల పీహెచ్ స్థాయులను అదుపులో ఉంచి తలలో ఫంగస్ పెరగనివ్వకుండా చేస్తుందంట. అరకప్పు నీటిలో పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకొని, దీన్ని స్ప్రేబాటిల్లో వేసి మాడుపై స్ప్రే చేసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత తలకు టవల్ చుట్టి, 15 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలట. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందట. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందట.
Dandruff: చలికాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Dandruff: చలికాలంలో చిన్ను సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Dandruff (2)
Last Updated: 08 Dec 2025, 07:24 AM IST