Site icon HashtagU Telugu

Black Neck: నల్లని మెడ కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Black Neck

Black Neck

ముఖం ఎంత తెల్లగా ఉన్నా మెడ భాగం నల్లగా ఉంటే అందంగా కనిపించకపోవడం మాత్రమే కాకుండా అందవిహీనంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే మెడపై ఉన్న నలుపును పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లు క్రీములు అప్లై చేస్తూ ఉంటారు. కొందరు నేచురల్ పద్ధతులు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే మెడపై నలుపు పోవాలంటే ఏం చేయాలో అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నల్లటి మెడను శుభ్రం చేయడానికి మీరు ఇంట్లో అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులను ప్రయత్నించవచ్చట. అయితే ఇందుకోసం నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది. ఈ నిమ్మకాయను ఉపయోగించి మనం మెడపై నలుపును తొలగించవచ్చట. దీని కోసం ముందుగా నిమ్మకాయ, శెనగపిండి ఈ రెండు కలిపి మెడపై రాసి రుద్దాల. ఇలా తరచుగా చేయడం వల్ల కచ్చితంగా మెడపై నలుపును పోగొట్టవచ్చని చెబుతున్నారు. కనీసం వారానికి మూడు సార్లు అయినా దీనిని మీ మెడపై అప్లై చేయాలని, అప్పుడు మాత్రమే మీకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.

మెడ పై ఉన్న నలుపును పోగొట్టడానికి శనగపిండి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. శనగపిండిలో ఉండే గుణాలు చర్మంపై టానింగ్‌ ను తగ్గించడంలో సహాయపడతాయట. ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంలో శనగపిండి చాలా సహాయపడుతుందట. ముఖంపై రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి శనగ పిండి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. కాగా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందట. ఇది చర్మం నల్లబడడాన్ని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే టమోటా పండు చక్కెర కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయట. టమోటా సగానికి కోసి దానిని చక్కెరలో ముంచి మెడ భాగంలో బాగా స్మూత్ గా రబ్ చేస్తూ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవడం వల్ల మెడ పై ఉన్న నలుపుదనం పోతుందని చెబుతున్నారు.

Exit mobile version