Site icon HashtagU Telugu

Pimples: మొటిమలు లేని చక్కని చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే?

Pimples And Hair Loss

Pimples And Hair Loss

ఈ రోజుల్లో చాలామంది యువత మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మొటిమల సమస్యకు కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా మనం తినే ఆహార పదార్థాలు కూడా కారణం కావచ్చు. ఆహార పదార్థాలకు మొటిమలకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా! ఉందండోయ్.. తినడానికి ఒక పద్ధతుంది. తినే ఆహార పదార్థాల జాబితాను బట్టే మీ శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తినే విషయంలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం చక్కెరను తగ్గించడం. చక్కెర తగ్గించాలంటే దాని అర్థం మీరు తాగే టీ, కాఫీల్లో పంచదార తక్కువేసుకుని తాగమని కాదు.

రోజులో నానా రకాల రూపాల్లో మన నోట్లోకి చక్కెరను లాగించేస్తుంటాము. చాక్లెట్లు, ఫిజ్జీ డ్రింకులు, సాసులు, కుకీలు, బిస్కట్లు, క్యాండీ బార్లు ఇలా దేన్ని పడితే దాన్ని తినకూడదు. చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో సుగర్ బాగా పెరుగుతుంది. మోతాదు మించితే అది మధుమేహానికి దారితీయవచ్చు. కేవలం తీపి పదార్థాలు మాత్రమే కాకుండా జంక్ ఫుడ్ కూడా బాగా తింటూ ఉంటారు. కేవలం ఒక్కసారి జంక్ ఫుడ్ మాత్రమే కాదు. ఫ్రైడ్ ఫుడ్, గ్రీజీ ఫుడ్ వల్ల శరీరంలో నూనె పదార్థాల స్థాయి పెరుగుతుంది.

దాన్ని బయటకు పంపి తనను తాను శుభ్రం చేసుకునేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. అదే మన చర్మం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింకులు కూడా మన చర్మానికి పెద్ద ఎత్తున సమస్యలు తెచ్చిపెడతాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా సమస్యలు తప్పవు. సమతులాహారం మన చర్మానికి బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. అది శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. శరీరంలో తేమను సమంగా ఉంచుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల మొటిమల సమస్య అసలు రాదు. అలా కాదు అని జంక్ ఫుడ్స్ తీపి పదార్థాలు ఎక్కువగా తింటే మాత్రం ముఖంపై మొటిమలు ఏర్పడడం ఖాయం.. అంతేకాకుండా ఆ ముఖం అందవిహీనంగా తయారవడం కూడా ఖాయం.

Exit mobile version