Site icon HashtagU Telugu

Back Acne Reducing Tips: వీపుపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి?

Back Acne Reducing Tips

Back Acne Reducing Tips

మామూలుగా మొటిమలు రావడం అన్నది సహజం. ఈ మొటిమలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మన చర్మంపై సెబెషియస్ గ్రంధులు ఉంటాయి. సీబం అనే పదార్థాన్ని ఈ గ్రంధులు రిలీజ్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో సెబెషియస్ గ్రంధులు అతిగా స్రవించడం వల్ల చర్మ రంధ్రాలు మూత బడిపోతాయి. ఫలితంగా మొటిమలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యలలో మొటిమలు ప్రధాన సమస్యగా ఉన్నాయి. మారుతున్న జీవన శైలితో పాటు హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, దుమ్ము ధూళి, పొల్యుషన్, చుండ్రు, మానసిక ఒత్తిడి, మోనోపాజ్‌, కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, పీసీఓడీ, రిఫైన్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలా రకరకాల కారణాలతో పింపుల్స్ వస్తాయి.

అయితే కొంతమందికి ఈ మొటిమలు ముఖంపై వస్తే మరి కొంతమందికి వెనుక వీపు భాగంలో మెడగ భాగంలో కూడా వస్తూ ఉంటాయి. ముఖంపై వచ్చే మొటిమల కంటే ఇవి మరింత బాధిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని కొన్ని న్యాచురల్ చిట్కాలతో పోగొట్టుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. అవిసె గింజల పొడి – 2 టీ స్పూన్స్, కమలా పండు తొక్కల పొడి – 1/2 టీ స్పూన్, జాజి కాయ పొడి – 1/2 టీ స్పూన్ ఈ మూడింటినీ కలిపి గిన్నెలో మిక్స్ చేసి ఆ పౌడర్‌ని స్నానానికి ఉపయోగించాలి. ప్రతి రోజూ ఈ పౌడర్‌ని ఉపయోగిస్తే కొన్ని వారాల్లోనే వీపుపై మొటిమలు తగ్గిపోతాయి.

అలాగే నిమ్మకాయలో విటమిన్ సి తోపాటు యాంటీ బయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి వీపుపై మొటిమలపై అప్లయ్ చేస్తే క్రమంగా తగ్గుతాయి. అలాగే చర్మంపై ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది. ఇక రాత్రిళ్లు పడుకునే ముందు వీపుపై ఉన్న మొటిమలపై కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే అద్భుత ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి రాసుకుంటే ఇంకా మంచిది. శనగపిండి, వంటసోడా, పాలు కలిపి పింపుల్స్‌కి అప్లయ్ చేసి పాపు గంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చక్కని ఫలితం ఉంటుంది. మొటిమలపై బొప్పాయి పండు గుజ్జును రాస్తే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. కలబందను కట్ చేసి ఆ జెల్‌ని మొటిమలపై అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గడంతోపాటు మచ్చలు కూడా పోతాయి. కలబందలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.