Site icon HashtagU Telugu

Ink Out Of Clothes: మీ బ‌ట్ట‌ల‌పై ఇంక్ మ‌ర‌క‌లు ఉన్నాయా..? అయితే ఈ ట్రిక్స్‌తో పోగొట్టండిలా..!

Dry Clothes

Dry Clothes

Ink Out Of Clothes: కొన్నిసార్లు పిల్లల పాఠశాల దుస్తులపై, కొన్నిసార్లు మన దుస్తులపై సిరా (Ink Out Of Clothes) గుర్తులు అనుకోకుండా ప‌డ‌తాయి. ఈ సిరా గుర్తుల వ‌ల‌న బ‌ట్ట‌లకు ఉన్న అందం పోతుంది. అంతేకాకుండా ఈ సిరా గుర్తులను శుభ్రం చేయడానికి చాలా శ్రమ, స‌మ‌యం అవ‌సరం. ఎన్నిసార్లు ఉతికినా బ‌ట్టల మీద ఉన్న సిరా గుర్తులు పోవు. అయితే బ‌ట్ట‌ల‌పై ఉన్న సిరా గుర్తుల‌ను తొల‌గించ‌టానికి ఈ రోజు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వీటి సాయంతో మీరు మీ బ‌ట్ట‌ల‌పై ఉన్న ఇంక్ మ‌ర‌క‌లను సుల‌భంగా తొలగించ‌వ‌చ్చు.

పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి

బట్టలపై ఇంక్ పడటం వల్ల వాటి అందం పోతుంది. మీ బట్టలపై సిరా ఉంటే మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. సిరా బ‌ట్ట‌ల‌పై ప‌డిన‌ తర్వాత మహిళలు తరచుగా బట్టలు ఉత‌క‌డం ద్వారా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు లేదా మళ్లీ మళ్లీ శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే బట్టలు చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా చేయ‌టం వ‌ల‌ప‌ కొన్నిసార్లు సిరా పోతుంది. కానీ ఆ వ‌స్త్రం మాసిపోతుంది.

టూత్ పేస్ట్ సహాయంతో శుభ్రం చేయవచ్చు

మీ బట్టల‌పై ఏదైనా సిరా ఉంటే మీరు దానిని టూత్‌పేస్ట్ సహాయంతో శుభ్రం చేయవచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. జెల్ టూత్‌పేస్ట్‌ను ఈ ప్రయోజనం కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. మరకను శుభ్రం చేయడానికి, ఆ ప్రదేశంలో కొద్దిగా టూత్‌పేస్ట్ రాయండి. ఇప్పుడు ఆ క్లాత్‌ను పక్కన పెట్టండి. టూత్‌పేస్ట్ ఆరిపోయే వరకు వేచి ఉండండి. టూత్‌పేస్ట్ పూర్తిగా ఆరిపోయిన త‌ర్వాత‌ డిటర్జెంట్‌తో వస్త్రాన్ని కడగాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే క్లాత్‌ పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.

Also Read: Rahul Dravid: ఇదే స‌రైన స‌మ‌యం.. రాహుల్ ద్ర‌విడ్‌కు భారత‌ర‌త్న ఇవ్వాల‌ని గ‌వాస్క‌ర్ డిమాండ్‌..!

మీరు పాలతో కూడా మరకలను తొల‌గించ‌వ‌చ్చు

మీకు శక్తి అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరూ పాలు తాగమని సలహా ఇస్తారు. అయితే పాల సహాయంతో సిరా మరకలను కూడా తొలగించవచ్చు. మీరు రాత్రంతా పాలలో తడిసిన క్లాత్‌ను నానబెట్టాలి. దీని తర్వాత ఆ క్లాత్‌ను కడగాలి. సిరా గుర్తు తేలికగా పోతుంది. ఈ విధానాన్ని రెండు-మూడు సార్లు అనుసరించడం ద్వారా సిరా పూర్తిగా మాయమవుతుంది.

ఆల్కహాల్ కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది

ఆల్కహాల్ కూడా బట్టలపై ఉన్న సిరా మ‌ర‌కను తొల‌గించ‌గ‌ల‌దు. దీని కోసం ఆల్కహాల్‌లో దూదిని ముంచి సిరా మరకపై నెమ్మదిగా అప్లై చేయాలి. ఇది మరకను క్లీన్ చేస్తుంది. మరక చాలా పెద్దదిగా ఉంటే సిరా ప‌డిన ప్రాంతాన్ని ఆల్కహాల్‌లో సుమారు 15 నిమిషాలు నానబెట్టండి. ఈ ప్రక్రియతో మరక తేలికగా పోతుంది.

We’re now on WhatsApp : Click to Join