Site icon HashtagU Telugu

Tomato’s : కల్తీ టమాటాలు ఎలా కనిపెట్టవచ్చో తెలుసా?

How to Find Adulterated tomatoes Check Here

Tomatos

Tomato’s : ఈ రోజుల్లో మనం తినే ఆహారాలు అన్నీ కల్తీ అవుతున్నాయి. దీంతో అసలు ఏదో నకిలీ ఏదో గుర్తించలేకపోతున్నాము. మనం వండుకునే కూరగాయల్లో ఎక్కువగా అన్నింటిలో టమాటాలు వాడుతుంటాము. ఆ టమాటాలు కల్తీవో కావో అన్న విషయం తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించవచ్చు.

* ఒక గిన్నెలో నీళ్ళు పోసి టమాటాలు వేయాలి అవి నీటి అడుగుకు చేరితే మంచివి. నీటి పైన తేలితే అవి కల్తీ టమాటాలు లేదా పాడయిన టమాటాలు.
* టమాటాలు కోసి చూసినప్పుడు కల్తీ టమాటాలు లోపల ఆకుపచ్చ రంగులో బయట ఎరుపు రంగులో ఉంటాయి. అదే నాచురల్ గా పండించిన టమాటాలు అయితే లోపల, బయట ఒకే రంగులో ఉంటాయి.
* కల్తీ టమాటాలు అయితే వాటి పైన పొర గట్టిగా ఉంటుంది. నాచురల్ టమాటాలు అయితే వాటి పైన పొర పలుచగా ఉంటుంది.
* కల్తీ టమాటాలలో గింజలు పూర్తిగా ఏర్పడవు అవి తెల్ల రంగులో ఉంటాయి. నాచురల్ టమాటాలలో గింజలు పూర్తిగా ఏర్పడతాయి.
* కల్తీ టమాటాలు రసాయనాల వాసనను కలిగి ఉంటాయి. నాచురల్ టమాటాలు సహజమైన వాసనను కలిగి ఉంటాయి.

Also Read : Ice Apple : తాటిముంజలతో హల్వా, జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసా..?

పైన చెప్పినవి ఇంటర్నెట్ ఆధారంగా తీసుకొని మీకు తెలియచేయడమైనది. హ్యాష్ ట్యాగ్ యు దీనిని ధ్రువీకరించడం లేదు.