Chanakya Niti: ఆచార్య చాణక్యుడి పేరు తెలియని వారంటూ ఉండరేమో. ప్రపంచంలోని అత్యుత్తమ పండితులలో ఆచార్య చాణుక్యుడు ఒకరు. అతని దూరదృష్టి విధానాలు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆచార్య చాణక్యుడు వ్యూహకర్త మరియు రాజకీయ పండితుడు మాత్రమే కాదు, అతను ఆర్థికశాస్త్రం మరియు యుద్ధ వ్యూహంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. ఆయనకు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడనే బిరుదులున్నాయి. చాణుక్య రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు మనిషి జీవితంపై అనేక నీతులను బోధించాడు.
ఒక వ్యక్తి సంక్షోభ సమయాల్లో ఎలా ప్రవర్తించాలి మరియు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆయన వివరంగా చెప్పాడు. సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మనిషికి ప్రధమ శత్రువు తన కోపమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కోపాన్ని ప్రదర్శించకూడదు. సమస్య నుంచి తప్పించుకునేవాడే కోపాన్ని ప్రదర్శిస్తాడని, అది మంచి లక్షణం కాదని చెప్పారు ఆచార్య చాణుక్యుడు. క్రోధస్వభావం గల వ్యక్తి అనవసర మాటలతో సమాధానం చెప్తాడని, దీని వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్య ఏదైనా ప్రశాంతంగా ఆలోచించాలని, నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే అదే గొప్ప సమాధానం అని అన్నారు.
సంక్షోభంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచన విధానంలో తడబాటు కనిపిస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనే దానిపై అవగాహన ఉండదు. అలాంటి సమయంలో మనిషి నోటిని, మెదడును కంట్రోల్ లో ఉంచుకోవాలి. సంక్షోభంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పారు ఆచార్య చాణుక్య.
జీవితంలో ఎప్పటికీ సహనం కోల్పోకూడదు. ఒక సాధువు పర్వతాన్ని బద్దలు కొట్టినా తన సంయమనాన్ని కోల్పోడు. అందుకే అలాంటి మనిషిని సముద్రం కంటే గొప్పవాడిగా చూస్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పొందుతాడు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా సంయమనంతో, విచక్షణతో ఎదుర్కొనే వ్యక్తి. తప్పకుండా విజయం సాధిస్తాడు.
Read More: Business Ideas: ఈ వ్యాపారంలో సంపాదన లక్షల్లో ఉంటుంది.. చేయాల్సిన బిజినెస్ ఇదే..!