Site icon HashtagU Telugu

Pedicure At Home: రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ చేసుకోండిలా?

Mixcollage 12 Feb 2024 04 31 Pm 1382

Mixcollage 12 Feb 2024 04 31 Pm 1382

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తలవెంట్రుకల నుంచి పాదాల వరకూ ప్రతి ఒక్కటి కూడా అందంగా, శుభ్రంగా ఉండాలి. అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా పెడిక్యూర్ చేస్తే పాదాలు అందంగా ఉంటాయి. ఆ పెడిక్యూర్ బ్యూటీ పార్లర్‌ కి వెళ్లి చేయిస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. కానీ చాలామంది అలా డబ్బులు పెట్టడానికి ఇష్టపడరు. మరి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ని ఎలా చేసుకోవాలో అందుకు ఏమేం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా పాదాలను శుభ్రంగా కడగాలి.

ఇందుకోసం ఓ టబ్ తీసుకుని అందులో గోరువెచ్చని నీరు వేయండి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. ఉప్పు వేయడం వల్ల పాదాలలోని దుమ్ముని దూరం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. పాదాలను శుభ్రంగా క్లీన్ చేశాక మీ గోర్లపై ఉన్న పాత నెయిల్ పాలిష్ క్లీన్ చేయాలి. నెయిల్ పాలిష్ రిమూవర్‌ని కాటన్‌ ప్యాడ్‌పై వేసి గోర్లని క్లీన్ చేయండి. నెయిల్ పాలిష్ పూర్తిగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. తర్వాత పాదాలను స్క్రబ్ చేయాలి. మంచి ఫుట్ స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేయవచ్చు. దీని కోసం పెడిక్యూర్ స్టోన్ ప్యూమిస్ స్టోన్ వాడుకోవచ్చు. అయితే, పాదాలపై మరీ ఎక్కువగా రాయకూడదు.
తర్వాత గోళ్ళని క్లీన్ చేయాలి.

చక్కగా షేప్ చేయాలి. ఆ టైమ్‌లో గోర్లలో ఉన్న మురికిని క్లీన్ చేయండి. ఎక్స్‌ట్రా‌గా ఉన్న స్కిన్ అంత తీసేయాలి. ఆ తర్వాత ఏదైనా క్రీమ్, మాయిశ్చరైజర్‌తో మీ పాదాలను మసాజ్ చేయాలి. దీని వల్ల పాదాలు మృదువుగా మారతాయి. అదే విధంగా రోజు రాత్రి పడుకునే ముందు కూడా ఏదైనా మాయిశ్చరైజర్ రెగ్యులర్‌గా అప్లై చేయండి. ఇప్పుడు గోర్లకి మీకు ఇష్టమైన ఏదైనా నెయిల్ పాలిష్ వేయాలి. దీని వల్ల గోర్లు చక్కగా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అయితే, నెయిర్ పాలిష్ వేశాక నెయిల్ వైట్‌నర్ వేయడం మంచిది. దీని వల్ల చూడ్డానికి చక్కగా ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలు చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. డెడ్ స్కిన్ దూరమవుతుంది. ఫుట్ ఇన్ఫెక్షన్స్ దూరం చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇంట్లోనే చేయడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది.