Hair Tips: జుట్టు చివర్ల చిట్లిపోతున్నాయా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?

అప్పుడప్పుడు మనకు జుట్టు చివర్ల చెట్లిపోవడం ఎర్రగా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జుట్లు చివర చిట్లి పోవడానికి అనేక రకాల కారణా

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 08:30 PM IST

అప్పుడప్పుడు మనకు జుట్టు చివర్ల చెట్లిపోవడం ఎర్రగా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జుట్లు చివర చిట్లి పోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏంటో? ఒకవేళ జుట్టు చిట్లి పోతే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు బాగా తడిగా ఉన్నప్పుడు చిక్కు తీయడం హెయిర్ కవర్ చేసుకోకుండా ఎండలోకి వెళ్ళటం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని ఎక్కువగా వాడడం, హెయిర్ రెగ్యులర్ గా ట్రిం చేసుకోకపోవడం, హెయిర్ రెగ్యులర్ గా కండిషన్ చేయకపోవడం, రోజూ హెయిర్ వాష్ చేయడం, హెయిర్ ని కెమికల్ ట్రీట్మెంట్ కి గురి చేయడం, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడడం, అన్ హెల్ది డైట్ తీసుకోవడం, స్ప్లిట్ ఎండ్స్ వాటంతటవే మాయమైపోవు.

స్ప్లిట్ ఎండ్స్ ని రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోతే అవి ఫెదర్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఇది హెయిర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది., స్ప్లిట్ ఎండ్స్ ఒక కలర్ లో, మామూలు హెయిర్ ఒక కలర్ లో ఉంటాయి. సో, కేర్ తీసుకోకపోతే హెయిర్ కలర్ అన్ ఈవెన్ గా కనపడుతుంది. జుట్టుకి సహజంగా ఉండే గ్లోస్ప్లిట్ ఎండ్స్ వల్ల పోతుంది. ఎన్ని హెయిర్ మాస్క్స్, ఎంత కండిషనింగ్ కూడా ఈ గ్లోని వెనక్కి తీసుకురాలేదు, మీరు స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేస్తే తప్ప. అయితే మరి ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ ని ఎలా ట్రిమ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్ప్లిట్ ఎండ్స్ ని ఇంట్లోనే అనేక రకాల పద్ధతుల్లో ట్రిమ్ చేయవచ్చు. దీనికి మీకు కావలసిందల్లా హెయిర్ ట్రిమ్మింగ్ సిజర్స్, దువ్వెన, అంతే.

ఇప్పుడు ఒక్కో మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.. హెయిర్ ట్విస్టింగ్ మెథడ్ హెయిర్ ట్రిమ్మింగ్ మెథడ్స్ ఇది ట్రెడిషనల్ మెథడ్. దీన్నే ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. జుట్టు పొడిగా ఉన్నప్పుడే ఇది చేయాలి. ముందుగా ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకుని కుదుళ్ళ నించి చివరి వరకూ క్లాక్ వైజ్ గా ట్విస్ట్ చేయండి.ఈ ట్విస్ట్ చేసిన సెక్షన్ ని లాగి పట్టుకోవాలి. తర్వాత ఈ ట్విస్ట్ పొడుగూతా మీకు స్ప్లిట్ ఎండ్స్ బైటికి కనిపిస్తూ ఉంటాయి. పైనించి కింద వరకూ ఇలా స్టిక్ ఔట్ అయిన స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేసుకుంటూ రాయాలి. ఇప్పుడు ఇదే సెక్షన్ ని యాంటీ క్లాక్ వైజ్ గా రీ-ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా కొన్ని స్ప్లిట్ ఎండ్స్ బయటకి కనిపిస్తాయి. వాటిని ట్రిమ్ చేసేయాలి. ఇలా హెయిర్ మొత్తం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.