Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు చివర్ల చిట్లిపోతుందా.. అయితే ఇలా చేయాల్సిందే?

Hair Tips

Hair Tips

మాములుగా స్త్రీలు ప్రతి ఒక్కరు నిగ నిగలాడే నల్లని జుట్టు కోసం మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తరచూ షాంపూలు, రకరకాల సబ్బులను ఉపయోగించి తలస్నానం చేయడం వల్ల జుట్టు చిట్లి పోవడం, హెయిర్ ఫాల్,అలాగే జుట్టు ఎర్రగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రకరకాల హెయిర్ స్టైల్ కోసం అనేక రకాల స్ప్రేలను ఉపయోగించడం వల్ల కూడా చిట్లి పోతుంతాయి. అయితే ఎక్కువ శాతం మంది చుట్టు చివరన చిట్లి పోవడం లాంటి సమస్యలుతో బాధపడుతుంటారు.

మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కూడా జుట్టు బాగా పొడి గా ఉన్నప్పుడు చిక్కు తీయడం చేయకూడదు. హెయిర్ కవర్ చేసుకోకుండా ఎండలోకి వెళ్ళకూడదు. అలాగే హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని ఎక్కువగా ఉపయోగించకూడదు. హెయిర్ రెగ్యులర్ గా ట్రిమ్ చేసుకోకపోవడం మంచిది. హెయిర్ రెగ్యులర్ గా కండిషన్ చేయకపోవడం, రోజూ హెయిర్ వాష్ చేయడం, హెయిర్ ని కెమికల్ ట్రీట్మెంట్ కి గురి చేయడం లాంటివి చేయకపోవడమే మంచిది. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడడం లాంటివి చేయకూడదు.

స్ప్లిట్ ఎండ్స్ ని ఎందుకు ట్రిమ్ చేయాలి అన్న విషయానికి వస్తే.. స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేయకుండా ఉండడం మంచిది కాదు. స్ప్లిట్ ఎండ్స్ వాటంతటవే మాయమైపోవు. కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ ని రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోతే అవి ఫెదర్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఇది హెయిర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది. స్ప్లిట్ ఎండ్స్ ఒక కలర్ లో, మామూలు హెయిర్ ఒక కలర్ లో ఉంటాయి. కేర్ తీసుకోకపోతే హెయిర్ కలర్ అన్ ఈవెన్ గా కనపడుతుంది. జుట్టుకి సహజంగా ఉండే గ్లో స్ప్లిట్ ఎండ్స్ వల్ల పోతుంది. ఎన్ని హెయిర్ మాస్క్స్, ఎంత కండిషనింగ్ కూడా ఈ గ్లోని వెనక్కి తీసుకురాలేదు, మీరు స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేస్తే తప్ప.

Exit mobile version