ప్రస్తుత రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో మొటిమల సమస్య కూడా ఒకటి. ముఖం మీద మొటిమలు వచ్చి ఈ ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మొటిమలు పోయిన ఆ నల్లటి మచ్చలు వాటి వల్ల ఏర్పడిన గుంతలు అలాగే ఉంటాయి. అయితే ముఖంపై మొటిమలు పోవడానికి రకరకాల ఫేస్ క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవేమీ లేకుండా కొన్ని సింపుల్ చిట్కాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలబంద గుజ్జు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద గుజ్జు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో నేచురల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. కలబంద జెల్ ను ఉపయోగించి మొటిమలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే మొటిమలను తగ్గించుకోవడం కోసం అలోవెరా జెల్ లో కొంచెం తేనెను కలిపి పేస్ట్ లా అప్లై చేయాలట. ఈ పేస్ట్ ను రోజూ ఉపయోగించడం వల్ల మొటిమలు పెరగవు. క్రమంగా తగ్గిపోతాయని చెబుతున్నారు.
అలాగే గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.. గ్రీన్ టీ తో మొటిమలను ఈజీగా తగ్గించుకోవచ్చట. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడతాయట. గ్రీన్ టీ బ్యాగ్ ను వేడినీటిలో చేయాలి. ఇది చల్లారిన తర్వాత ఈ గ్రీన్ టీ నీటిని మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు తగ్గిపోతాయట.
గంధాన్ని కూడా మొటిమలను తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చట. గంధలో యాంటీ పైరెటిక్, యాంటీ సెప్టిక్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి మొటిమలను తగ్గించడానికి బాగా ఉపయోగడపతాయట. అయితే గంధం పొడిని తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లా చేయాలట. దీన్ని మొటిమల మీద మాత్రమే అప్లై చేసి కొన్ని గంటల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలట. ఈ విధంగా గంధం ఉపయోగించడం వల్ల మొటిమలు తొందరగా తగ్గిపోతాయని చెబుతున్నారు.