Site icon HashtagU Telugu

Rice Cooking Tips : అన్నం ఎలా వండుకుంటే ఆరోగ్యానికి మంచిది? చాలామందికి తెలియని చిట్కాలు..!

How to cook rice that is good for health? Tips that many people don't know..!

How to cook rice that is good for health? Tips that many people don't know..!

Rice Cooking Tips : మన ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. అన్నం లేకుండానే చాలామంది జీవితం ఊహించలేరు. అయితే ఇటీవల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్), అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు అన్నం తినకూడదని అనేకరకాలుగా చెబుతున్నారు. నిజానికి అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా దాన్ని ఎలా వండుకుంటున్నామన్నదే అసలు కీలకం. అన్నం వండే విధానంపై స్పష్టత కల్పించేందుకు ఇప్పుడే తెలుసుకుందాం. గంజి వార్చడం, ప్రెజర్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్..ఏది బెస్ట్?

1. గంజి వార్చి వండడం (Starch Removal Method)

లాభాలు:

మధుమేహం ఉన్నవారికి ఇది మేలైన పద్ధతి. గంజిలో ఉండే అదనపు పిండిపదార్థం వదిలిపెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం తక్కువగా ఉంటుంది.
ఒత్తిడి లేకుండా ఉడికించడంవల్ల విటమిన్లు, ఖనిజాలు బాగానే మనకు అందుతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఉపయుక్తం.

నష్టాలు:

సమయం ఎక్కువ పడుతుంది. అదనంగా గ్యాస్ లేదా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.
గంజి పూర్తిగా వడకట్టకపోతే ప్రయోజనం ఉండదు.
కొంతమంది అనగా ఉండే వండడం ఇష్టపడకపోవచ్చు.

2. ప్రెజర్ కుక్కర్‌లో వండడం

లాభాలు:

వేగంగా వండుకోవచ్చు, తక్కువ ఇంధనం అవసరం అవుతుంది.
అన్నం మెత్తగా ఉడుకుతుంది, కొందరికి జీర్ణం చేయడం సులభం.

నష్టాలు:

అధిక ఒత్తిడి కారణంగా బి కాంప్లెక్స్, ఇతర సూక్ష్మ పోషకాలు నష్టపోతాయి.
గంజిని వదిలే అవకాశం ఉండదు కాబట్టి పిండి పదార్థం ఎక్కువగా మిగిలిపోతుంది.
మధుమేహం ఉన్నవారికి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

3. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడితే?

లాభాలు:

వంటకళ తెలియని వారికి సులభంగా వాడుకునే పద్ధతి.
అన్నం చాలా సేపు వేడిగా ఉంటుంది.
వంటకానికి మానిటరింగ్ అవసరం లేదు.

నష్టాలు:

అన్నం సాధారణంగా మెత్తగానే కుకవుతుంది, కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు.
“వామ్” మోడ్‌లో ఎక్కువసేపు ఉంచితే ఎక్కువ ఉడికిపోతుంది.
గంజి వదిలే అవకాశం తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారికి తగినది కాదు.

ఎంత తినాలో కంటే ఎలా వండుకుంటున్నామన్నదే ముఖ్యం..

అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు గంజి వార్చిన అన్నం తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. అంతేకాదు, బ్రౌన్ రైస్, అన్‌పాలిష్డ్ రైస్ వంటివి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తక్కువ GI ఉన్న బియ్యం రకాలూ, ఎక్కువగా ఫైబర్ ఉన్న కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే పప్పులు కూడా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాగా, అన్నం తినడం తప్పదు. కానీ ఏ పద్ధతిలో వండుతున్నామో, దానిని ఎలా సమతుల్య ఆహారంతో తీసుకుంటున్నామో అన్నదే మీ ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.

Read Also: Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు