Diabetes: మధుమేహం టైప్ – 1.5 గురించి మీకు తెలుసా? దీన్ని కట్టడి చెయ్యడం అస్సలు కుదరదట?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మధుమేహం. అయితే ఇదివరకు మధుమేహం అన్నది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ రాను రాను ఈ మధుమేహం అన్నది చిన్నపిల్లల నుంచే మొదలవుతోంది.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 09:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మధుమేహం. అయితే ఇదివరకు మధుమేహం అన్నది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ రాను రాను ఈ మధుమేహం అన్నది చిన్నపిల్లల నుంచే మొదలవుతోంది. ఈ మధుమేహం ఒక్కసారి వచ్చింది అంటే చాలు ఇక జీవితాంతం కూడా అలాగే ఉంటుంది. అయితే మధుమేహం విషయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ప్రాణాలే పోవచ్చు. మధుమేహంతో టైప్ 1, టైప్ 2 గురించి మనందరికీ తెలిసిందే. కానీ టైపు 1.5 డయాబెటిస్ ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు.

దేనినే డయాబెటిస్ టైప్ 1.5 నీ ఎల్ఏడీఏ అని పిలుస్తారు. టైప్-1, టైప్-2 లక్షణాల్లో కొన్ని ఈ టైప్-1.5 రకంలో కనిపిస్తాయి. అయితే ఈ మధ్యరకం మధుమేహం ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఇక ఇందులో ప్రధానంగా ఆటో ఇమ్యూన్ కారకం ఉంటుంది. ఎప్పుడైతే పేంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుందో, అప్పుడీ ఈ ఆటో ఇమ్యూన్ కారకం పొరబాటున ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణజాలం పై దాడి చేసి నాశనం చేస్తుంది. అయితే ఈ టైప్-1.5 ఎల్ఏడీఏ మధుమేహం లక్షణాలు గురించి చూసుకుంటే..

ఇది ప్రధానంగా వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన వ్యాధి అని చెప్పవచ్చు. ఒకసారి ఎల్ఏడీఏకి గురయిన తరువాత ఆహారంలో మార్పులు, జీవనశైలిని ఎటువంటి మార్పులు చేసిన కూడా దీన్ని కట్టడి చేయలేము. అయితే ఈ టైప్ 1.5 డయాబెటీస్ కూడా టైప్-1 డయాబెటిస్ తరహాలోనే ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అధిక దాహం, కంటిచూపు మందగించడం, బరువు తగ్గిపోవడం, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలు ఈ టైప్-1.5 మధుమేహంలోనూ కనిపిస్తాయి.