Water Bottles : వాటర్ బాటిల్స్ ను ఎలా క్లీన్ చేస్తే వాసన పోతాయో తెలుసా?

వాటర్ బాటిల్స్ ని రోజూ వాడుతుండడం వలన వాసన వస్తుంటాయి. క్లీన్(Cleaning) చేయకపోతే లోపల జిడ్డుగా తయారవుతుంది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 08:30 AM IST

మనం రోజూ ఇంట్లో, బయట ఎక్కడున్నా దాహం వేస్తే వాటర్(Water) ను తాగుతుంటాము. కాబట్టి వాటర్ ని తీసుకెళ్లడానికి బాటిల్స్(Water Bottles) ని వాడుతుంటాము. అయితే వాటర్ బాటిల్స్ ని రోజూ వాడుతుండడం వలన వాసన వస్తుంటాయి. క్లీన్(Cleaning) చేయకపోతే లోపల జిడ్డుగా తయారవుతుంది. కొంతమంది నోటికి దూరంగా పెట్టుకొని వాటర్ తాగుతుంటారు కొంతమంది నోటికి దగ్గరగా పెట్టుకొని వాటర్ తాగుతుంటారు ఎవరైతే నోటికి దగ్గరగా పెట్టుకొని వాటర్ తాగుతారో వారి బాటిల్ తొందరగా వాసన వస్తుంది.

ఆ వాసన పోగొట్టడానికి మనం టీ పొడితో డికాషన్ చేసుకొని దానిని వాటర్ బాటిల్ లో వేసి షేక్ చేసి కడగాలి. ఇలా చేయడం వలన వాటర్ బాటిల్ లో చెడు వాసన పోతుంది, క్లీన్ గా కూడా తయారవుతుంది. నిమ్మరసం కొద్దిగా తీసుకొని దానిని వాటర్ బాటిల్ లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని షేక్ చేసి కడగాలి. ఇలా చేసినా వాటర్ బాటిల్ లో ఉన్న వాసన పోతుంది. నారింజ తొక్కలు వాటర్ బాటిల్ లో వేసి కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉంచి షేక్ చేసి కడిగితే వాసన పోతుంది.

ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని వాటర్ బాటిల్ లో వేసి దాని నిండా నీళ్లు పోసి ఒక రోజంతా అలాగే ఉంచాలి. తరువాత రోజున కడుగుకోవాలి ఇలా చేయడం వలన వాటర్ బాటిల్స్ లో ఉన్న వాసన పోతుంది. సబ్బుతో వారానికి ఒకసారి అయినా బాటిల్ ని కడుక్కొని తరువాత ఎండలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన వాటర్ బాటిల్స్ లో చెడు వాసన పోతుంది. ఈ విధంగా మనం రోజూ తాగే వాటర్ బాటిల్స్ ని శుభ్రం చేసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలకు రోజూ స్కూల్ కి పంపడానికి వాటర్ బాటిల్స్ వాడుతుంటాము వాటిని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Also Read : Conservation of Rivers : వాటర్ ఉమెన్.. నదుల్లో నీళ్లే కాదు..కన్నీళ్లు కూడా ఉంటాయ్