Gas Stove Cleaning : గ్యాస్ స్టవ్ జిడ్డును పోగొట్టడానికి చిట్కాలు తెలుసుకోండి..

మన వంటింట్లో గ్యాస్ స్టవ్(Gas Stove) పై అన్ని రకాల వంటలు చేసుకుంటూ ఉంటాము. దీని వలన స్టవ్ ఎక్కువగా జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డు పోగొట్టడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 10:00 PM IST

మన వంటింట్లో గ్యాస్ స్టవ్(Gas Stove) పై అన్ని రకాల వంటలు చేసుకుంటూ ఉంటాము. దీని వలన స్టవ్ ఎక్కువగా జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డు పోగొట్టడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. స్టవ్ మీద మరకలు పడినప్పుడు వాటిని క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసి మళ్ళీ మనం స్టవ్ వాడడం వలన ఆ మరకలు ఎండిపోయి స్టవ్ క్లీన్(Gas Stove Cleaning) చేయడం కష్టంగా మారుతుంది.

గోరువెచ్చని నీటిలో సర్ఫ్ వేసి కలిపి కాసేపు ఉంచి తరువాత స్పాంజ్ ముంచి దానితో గ్యాస్ స్టవ్ ను తుడవాలి. ఒక పది నిముషాలు తరువాత దానిని పొడి గుడ్డతో తుడవాలి. తరువాత బేకింగ్ సోడాను స్టవ్ మీద జల్లి నిమ్మకాయతో రుద్దాలి. అప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఉన్న జిడ్డు తొందరగా పోతుంది.

ఒక గిన్నెలో నీటిని పోసి డిష్ సోప్, బేకింగ్ సోడాను సమభాగాలుగా వేసి బాగా కలిపి దానిలో బర్నర్ స్టాన్డ్స్ ను ఒక పదిహేను నిముషాల పాటు ఉంచితే వాటికి ఉన్న మరకలు మొత్తం పోతాయి.

బేకింగ్ సోడా, ఉప్పును సమానభాగాలుగా తీసుకొని దానికి నీటిని కలిపి పేస్ట్ లాగా తయారుచేసుకొని దానిని పొయ్యి మీద స్క్రబ్ చేయాలి. ఇలా చేసి ఒక పది నిముషాల తరువాత మామూలు నీటితో కడగాలి. ఇలా చేసినా గ్యాస్ స్టవ్ మీద జిడ్డు తొలగిపోతుంది.

వెనిగర్ ను గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసి ఒక పది నిముషాల తరువాత క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోతుంది.

ఉల్లిపాయ ముక్కల్ని కోసి దానిని నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఆ నీటిని చల్లారనివ్వాలి. తరువాత దానిని ఒక స్ప్రే బాటిల్ లో పోసి గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసి కాసేపు ఉంచి తరువాత కడిగితే గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోతుంది. ఈ విధంగా మనం కొన్ని చిట్కాలతో గ్యాస్ స్టవ్ మీద ఉన్న జిడ్డు పోగొట్టవచ్చు.

 

Also Read : Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలను పాటించాల్సిందే?