మనం ఎక్కువగా టిఫిన్స్(Tiffins) అట్లు(Dosa) వేసుకోడానికి, లేదా చపాతీ, లేదా ఇంకేదైనా టిఫిన్ కి పెనం వాడతాము. ప్రతి వంటింట్లో పెనం ఉంటుంది. మనం రెగ్యులర్ గా వాడటం వలన పెనాలు జిడ్డుగా తయారవుతాయి. ఆ జిడ్డును మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ పెనం ఎక్కువగా వాడుతుంటారు. అయితే కొంతమంది ఇంకా ఇనుము పెనం(Pan) వాడుతుంటారు.
ఇనుము పెనం మీద జిడ్డు వదలడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. మాములుగా అన్ని వంట పాత్రలు తోమినట్టు తోమితే ఒక్కోసారి దానికి ఉన్న జిడ్డు పోదు. నిమ్మకాయను సగానికి కోసి ఉప్పు రాసి దానిని పెనం మీద జిడ్డు ఉన్న చోట రుద్ది ఒక ఐదు నిముషాల పాటు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో పెనాన్ని శుభ్రంగా కడుకోవాలి. వెనిగర్ ని ఉపయోగించి కూడా పెనం మీద జిడ్డును వదిలించుకోవచ్చు. ఒక గిన్నెలో నీరు, వెనిగర్ సమపాళ్లలో తీసుకొని దానిలో స్పాంజ్ ముంచి ఉంచి దానితో పెనం మీద జిడ్డు ఉన్నచోట రాయాలి. ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేస్తూ కడగాలి.
ఇలా రెండు విధాలుగా పెనం మీద జిడ్డును వదిలించుకోవచ్చు. కాబట్టి పెనం మీద జిడ్డును ఈ చిట్కాలను ఉపయోగించి తొలగించుకోవచ్చు. పెనం జిడ్డుగా అనిపిస్తే జిడ్డును పోగొట్టండి అప్పుడు మనకు హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి. మనం పెనాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.