చిన్న పిల్లలు(Kids) ఆరోగ్యంగా ఉండడానికి మనం మంచి బట్టలు, మంచి ఆహారాన్ని పిల్లలకు పెడతాము. అదేవిధంగా పిల్లల పాల బాటిల్స్(Baby Feeding Milk Bottles) ని కూడా శుభ్రంగా ఉంచితే పిల్లలకు మంచిది. కొంతమంది పిల్లలకు పాలిచ్చే తల్లులు పాలు సరిపోక లేదా పాలు పడక పాల బాటిల్స్ ను ఉపయోగిస్తారు. అయితే పాల బాటిల్స్ ను వాడేవారు రెండు లేదా మూడింటిని ఉపయోగించాలి. పాల బాటిల్స్ అన్నీ ఖాళీ అయ్యేవరకు కడగకుండా ఉంచకూడదు. లేకపోతే పాల బాటిల్స్ లో తొందరగా క్రిములు, బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఖాళీ అయిన వెంటనే పాల బాటిల్ ని కడగాలి ఇలా చేయడం వలన పిల్లలకు కడుపులో నొప్పి, విరోచనాలు వంటివి రాకుండా ఉంటాయి.
పాల బాటిల్స్ ను కడగడానికి ముందు మన చేతులను సబ్బు పెట్టి శుభ్రంగా కడుగుకోవాలి. పాల బాటిల్స్ ను శుభ్రం చేసేటప్పుడు పైపైన కాకుండా లోపల ఉండే ప్రతిదానిని తీసుకొని శుభ్రంగా కడుగుకోవాలి. అప్పుడే పాల బాటిల్స్ లో ఉండే క్రిములు పోతాయి. పాల బాటిల్స్ ను కడిగేటప్పుడు బాటిల్స్ కడిగే బ్రష్ ను ఉపయోగించుకోవాలి. పాల బాటిల్స్ ను కడగడానికి గోరువెచ్చని నీళ్ళను ఉపయోగించుకోవాలి. వేడి నీళ్ళతో కడగడం వలన పాల బాటిల్స్ లో ఏమైనా క్రిములు, బ్యాక్టీరియా ఉన్న నశించిపోతుంది.
పాలు జిగురుగా ఉంటాయి కాబట్టి బాటిల్స్ ని కడిగినా వాటికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి పాల బాటిల్స్ ను కడిగిన తరువాత గోరువెచ్చని నీళ్ళల్లో వేసి పది నిముషాలు మరిగించాలి. ఇలా చేయడం వలన పాల బాటిల్స్ లోని క్రిములు పోతాయి. కాబట్టి పాల బాటిల్స్ ను ఉపయోగించే వారు పాల బాటిల్స్ ను వాడిన వెంటనే గోరువెచ్చని నీటితో బాటిల్స్ కడిగే బ్రష్ తో శుభ్రపరుచుకొని ఆరబెట్టాలి. ఈ విధంగా చేయడం వలన మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
Also Read : Health Benefits: తులసి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
