Right Perfume: ఎలాంటి పర్ఫ్యూమ్ ఎంచుకోవాలో తెలుసా..?

పరిమళాలు వెదజల్లే సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకే ఉంటుంది. ఎలాంటి పరిమళం అయినాసరే సుదీర్ఘకాలం ఉండదు.

Published By: HashtagU Telugu Desk
Perfume Side Effects

Perfume Side Effects

పరిమళాలు వెదజల్లే సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకే ఉంటుంది. ఎలాంటి పరిమళం అయినాసరే సుదీర్ఘకాలం ఉండదు. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పరిమళాల కోసం ఎంత ఖర్చు చేస్తామో లెక్కే ఉండదు. కానీ ఎలాంటి పరిమళమైనా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పర్ ఫ్యూమ్ ను ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

ప్రశాంతతనిచ్చే పరిమళాలే మనసుకు హాయిగా ఉంటుంది. మార్కెట్లో ఎన్నోరకాల పరిమళాలు అందుబాటులో ఉంటున్నాయి. అద్భుతమైన పరిమళం వెదజల్లే సువాసన కోసం షాపులకు, మాల్స్‌కు వెళితే అక్కడ అన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఏది తీసుకోవాలో తెలియని గందరగోళం ఏర్పడుతుంది. మనం ఇష్టపడే సువాసనతో పాటు దానికన్నా మంచిది ఉందని, ఇది ఒకసారి ట్రై చెయ్యండని సేల్స్ మెన్స్ బాగా ఇబ్బంది పెడుతుంటారు. వారి మాటలు పట్టించుకోకుండా మీరు కొన్ని చిట్కాలను పాటించి మీకు నచ్చిన పర్ఫ్యూమ్స్ ఎంచుకోవడం మంచిది.

* ప్రతి పర్ఫ్యూమ్ బాటిల్ గురించి మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే..వాటిపై ఉండే కండిషన్స్ చదవడం. కాలంతోపాటు ఇవి కూడా మారుతుంటాయి. ప్రతి పర్ఫ్యూమ్ కు మూడు కండిషన్స్ ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ అండ్ మిడిల్. టాప్ నోట్ ఏంటంటే.. పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసిన తొలి పదిహేను నిముషాల వరకు సువాసన ఉంటుంది. తరువాత తగ్గిపోతుంది. అదే మిడిల్ నోట్ చూస్తే.. ఆ పరిమళం కొన్ని గంటల వరకు అలాగే ఉంటుంది. ఇక బాటమ్ నోట్‌కి చూస్తే ఇది రోజంతా ఉంటుంది. కాబట్టి మంచి సువాసన వెదజల్లే పర్‌ఫ్యూమ్ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు టాప్ నోట్ మాత్రమే కాకుండా బాటమ్ అండ్ మిడిల్ నోట్స్‌ను కూడా నిర్దారించుకోవాల్సి ఉంటుంది.

* ఇప్పటికే మీకు తెలిసిన కొన్ని పరిమళాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఇష్టపడే సువాసనతో కూడిన పరిమళాన్ని వెతికేందుకు ప్రయత్నం చేయండి. షాప్‌కు వెళ్లినప్పుడు అలాంటి సువాసన కావాలని అడిగి తీసుకోండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నట్లయితే కోరుకున్న సువాసనను ఎంపికను వివరించే ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి.

* ఫర్ఫ్యూమ్స్ ఎంచుకునేటప్పుడు మొదటగా లైట్‌గా ఉన్నవాటిని వాడి చూడండి. తరువాత ఘాటైన సువాసనలను సెలక్ట్ చేసుకోండి. మస్కీ, కలప వంటివి తేలికైన సువాసనలను వెదజల్లుతుంటాయి.

* అన్నింటిని ఒకేసారి ప్రయత్నం చేయవద్దు. వాటిని పరీక్షించడంలో తొందర పడకూడదు. ఎంత ఎక్కువగా వాసన చూస్తే మంచి సువాసన ఉన్న వాటిని ఎన్నుకోవడంలో గందరగోళ పడతారు. కాబట్టి ఒకేసారి మూడు పరిమళాల కంటే ఎక్కువగా ప్రయత్నించవద్దు.

* పర్‌ఫ్యూమ్‌ను పరీక్షించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాటి మధ్య బ్రేక్ తీసుకోవడం. రకరకాల పరిమళాలతో ఒకేసారి పరీక్షించకూడదు.

* ఒకే పరిఫ్యూమ్ వేర్వేరు వ్యక్తులపై భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి పరిమళాన్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి శ్యాంపిల్ తీసుకుని రోజంతా పరీక్షించాలి.

  Last Updated: 29 Apr 2022, 09:05 PM IST