Site icon HashtagU Telugu

Black Heads : ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను ఇలా తొలగించుకోండి..

black heads removal tips

black heads removal tips

Black Heads : ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పేరుకుపోవడం వల్ల చాలా మంది వాటిని తొలగించుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ చాలా బాధిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ముక్కు, గడ్డం, నుదురు భాగాల్లో వస్తుంటాయి. వీటివల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, చర్మంపై మురికి, మృతకణాలు పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత.. బ్లాక్ హెడ్స్ రావడానికి కారణాలు. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ ను తొలగించుకునేందుకు ఖరీదైన క్రీమ్ లను వాడుతుంటారు. అలాగే పార్లర్లకు వెళ్లి చాలా ఖర్చు చేస్తుంటారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. దీనివల్ల స్కిన్ కు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పుదీనా ఆకులను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక్కగిన్నెలోకి తీసుకుని.. పావుచెక్క నిమ్మరసం, టూత్ పేస్ట్, పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుని ఉంచుకోవాలి.

బ్లాక్ హెడ్స్ ఉన్న స్కిన్ ను వేడినీటితో క్లీన్ చేసుకోవాలి. 5 నిమిషాలపాటు ఆవిరిపట్టి.. దానిపై ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పుదీనా పేస్ట్ రాసి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఒక అరగంట పాటు దానిని అలాగే ఉంచి చల్లనినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరుకుగా ఉండే క్లాత్ తో బ్లాక్ హెడ్స్ పై రుద్దాలి. ఇలా వరుసగా మూడు రోజులు ఈ చిట్కా పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. వైట్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.

Exit mobile version