Site icon HashtagU Telugu

Hair Tips: ఏంటి టీ మన జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుందా.. అదెలా సాధ్యం అంటే?

Hair Tips

Hair Tips

ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా కాఫీ లేదా టీ తాగాల్సిందే. కొందరు టీ తాగనిదే రోజు కూడా ప్రారంభించరు. కనీసం రోజులో ఒక్కసారి అయినా టీ తాగకపోతే ఎలాగో ఉంది అని అంటుంటారు. అయితే టీ తాగడం మంచిదే కానీ శృతి మించి తాగితే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. కాగా టీ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. అలాగే అందమైన, మెరిసే కురులు మన సొంతం అవుతాయట. ఏంటి టీతో జుట్టు పెరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు.. ఇంతకీ ఆ టీ ఏదో దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కువమంది ఇష్టపడే తాగే టీలలో గ్రీన్ టీ కూడా ఒకటి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్‌ కు ప్రసిద్ధి చెందిన గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అలాగే జుట్టు రాలడం నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను పునరుజ్జీవింపజేయడంలో ఎంతో బాగా సహాయపడతాయట. అలాగే మూలాల నుండి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు..

కెఫిన్‌ తో నిండిన బ్లాక్ టీ తలలో రక్త ప్రసరణను ప్రేరేపిస్తుందట. అలాగే ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన స్కాల్ప్‌ ను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడే లక్షణాలను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. బ్లాక్ టీ లో అధిక యాంటీ ఆక్సిడెంట్, కెఫిన్ కంటెంట్‌ లు ఉన్నాయట. ఇవి హెల్తీ స్కాల్ప్ , హెయిర్‌ కు మద్దతునిస్తాయట.

జుట్టు పెరగడానికి ఉపయోగపడే టీ లలో చమోమిలే టీ మన స్కాల్ప్‌ ను శాంత పరచి, చుండ్రు, దురద వంటి సమస్యలను దూరం చేస్తుందట. కాబట్టి చుండ్రు మీ జుట్టును కోల్పోయేలా చేస్తే, చమోమిలే టీ అందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.

జుట్టు పెరుగుదలకు పిప్పరమెంటు టీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో, పిప్పరమెంటు టీ హానికరమైన సూక్ష్మజీవులను దూరంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన స్కాల్ప్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందట. ఈ టీ హెయిర్ ఫోలికల్స్‌ కి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుందట. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు.

అయితే ఈ టీ లను ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా జుట్టును సున్నితమైన షాంపూతో కడిగి ఆ తర్వాత టీ లతో శుభ్రం చేసుకోవాలట. అయితే టీ ని మీ జుట్టుకు ఉపయోగించే ముందు టీ చల్లగా ఉందో లేదో చెక్ చేసుకోవాలట. జిడ్డు జుట్టు ఉన్నవారు వారానికి రెండు లేదా మూడుసార్లు టీ ని అప్లై చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయట. ఇలా చేయడం వల్ల అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. తేనె, పెరుగు లేదా కలబంద వంటి ఇతర పదార్థాలతో టీని కూడా కలిపి మీరు పోషకమైన హెయిర్ మాస్క్‌ ని తయారు చేసుకోవచ్చట.