Site icon HashtagU Telugu

Friendship Day 2025 : స్నేహితుల దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేయాలి..?మరి ఈ ఏడాది ఇది ఏ రోజు వచ్చిందంటే..

How should we celebrate Friendship Day? And what day does it fall on this year?

How should we celebrate Friendship Day? And what day does it fall on this year?

Friendship Day 2025 : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటుంది. మన బాధను పంచుకునే వారైనా, ఆనందాన్ని రెట్టింపు చేసే వారైనా, అది స్నేహితులే. అందుకే ఈ అద్భుతమైన బంధాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్షిప్ డేను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. 2025 సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజున వస్తోంది. భారతదేశంలో ఆగస్టు నెలలోని మొదటి ఆదివారం రోజునే ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకునే ఆనవాయితీ ఉంది. అయితే, జాతీయ స్థాయిలో కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జూలై 30వ తేదీను అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటారు.

ఫ్రెండ్‌షిప్ డే ఉద్భవం ఎలా..?

స్నేహితుల మధ్య బంధాన్ని గౌరవించేందుకు 1958 జూలై 30న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతిపాదించారు. అనంతరం, 2011లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూలై 30వ తేదీని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచే అనేక దేశాలు ఇదే తేదీన ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటున్నాయి.

స్నేహితుల దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేయాలి..?

ఈ ప్రత్యేక రోజున, మనకు అతి సన్నిహితమైన స్నేహితులతో కలిసి సమయం గడపడం, వారి తోటి బంధాన్ని మరింత బలపరచడం చాలా ముఖ్యం. ఒకరికొకరు చిన్న బహుమతులు ఇచ్చుకోవడం, తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా మాట్లాడుకోవడం వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరు కూడా ఈ సంవత్సరం మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ డేను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన ఐడియాలు:

. మీ స్నేహితుడితో కలిసి చిన్న పిక్నిక్ ప్లాన్ చేయండి. ప్రకృతి మధ్యలో ఒక మంచి స్మరణీయ సమయం గడపండి.
. పాత ఫొటోలతో ఓ మినీ ఆల్బమ్ తయారు చేసి గిఫ్ట్ చేయండి.
. మీ స్నేహితుడి ఇష్టాలకు అనుగుణంగా ఓ చిన్న సర్‌ప్రైజ్ ప్లాన్ చేయండి.
. ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌కి వెళ్లండి లేదా ఇంట్లోనే ఓ మంచి సినిమా నైట్ ఏర్పాటు చేయండి.
. ఒకరితో ఒకరు చేతులతో తయారు చేసిన వంటలు పంచుకోవచ్చు – ఇది బంధాన్ని మరింతగా బలపరుస్తుంది.
. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి, వారిని ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పండి.

గొడవలు ఉంటే.. ఇదే సరైన సమయం

చాలా సార్లు, చిన్నచిన్న విభేదాల వల్ల మంచి స్నేహితుల మధ్య దూరం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఫ్రెండ్‌షిప్ డే ఒక ఉత్తమమైన అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. వారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం, మన్నింపు అడగడం లేదా స్నేహాన్ని మళ్లీ నెలకొల్పేందుకు ప్రయత్నించడం చాలా మంచిది. స్నేహం అనేది జీవితాన్ని మరింత అందంగా మార్చే శక్తి. ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజు.. మీ స్నేహితులకు మీరు ఎంత ప్రేమతో ఉండాలో, వాళ్లు మీ జీవితంలో ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అలా అయితే ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ మీ స్నేహితుల కోసం ప్రత్యేకంగా కేటాయించండి.. గుర్తుంచుకోండి, మంచి స్నేహితుడు జీవితాన్ని మారుస్తాడు.

Read Also: Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!