Site icon HashtagU Telugu

Beauty Tips: ఏంటి! రోజ్ వాటర్ తో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

Rose Water

Rose Water

రోజ్ వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రోజ్ వాటర్ అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లలో కూడా ఈ రోజ్ వాటర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు వాటర్ లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే వీటిని ఎప్పటినుంచో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. చర్మ సమస్యలను అలాగే ముఖానికి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.. మీకు తెలుసా? ఈరోజు వాటర్ కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తాయట. మరి ఈ రోజ్ వాటర్ కంటికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రోజ్ వాటర్ లో సహజ శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలు కంటి ఎరుపు, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయట. అందుకే మీ కళ్లు ఎర్రగా ఉన్నప్పుడు రోజ్ వాటర్ ను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఫోన్ లాప్టాప్ లేదా కంప్యూటర్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కూడా కళ్ళు ఎక్కువగా అలసిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కళ్ళు పొడిబారుతూ ఉంటాయి. అలాంటి సమయంలో రోజ్ వాటర్ కళ్ళను రిఫ్రెష్ చేసి రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. పొడి కంటి అసౌకర్యాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుందని చెబుతున్నారు.. అలాగే రోజ్ వాటర్ కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయట. ఇది మీ కళ్లకు ప్రకాశవంతమైన, మరింత యవ్వన రూపాన్ని ఇస్తుందట.

రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి రోజ్ వాటర్ మన కళ్లను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కాపాడుతుందట. అలాగే మీరు మరింత యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువసేపు స్క్రీన్ టీవీ వంటివి చూడటం వల్ల కళ్ళు అలసటకు గురవుతాయి. దాంతో కళ్ళు మంటగా అనిపించడం నొప్పిగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అలసిన కళ్లపై రోజ్ వాటర్ ను అప్లై చేయడం వల్ల వాటిని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది కంటి ఒత్తిడి, అలసటను తగ్గిస్తుందని చెబుతున్నారు.