Site icon HashtagU Telugu

Oats Walnut Cutlets: ఎంతో రుచిగా ఉండే ఓట్స్ వాల్ నట్స్ కట్లెట్.. తయారు చేసుకోండిలా?

Oats Walnut Cutlets

Oats Walnut Cutlets

ఓట్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓట్స్ తో ఎప్పుడు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేయాలని భావిస్తూ ఉంటారు. పిల్లలు భర్తలు కూడా వెరైటీగా ఏదైనా కోరుకుంటూ ఉంటారు. మరి ఓట్స్ తో వాల్‌నట్స్‌ కట్లెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఓట్స్ వాల్‌నట్స్‌ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు..

ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
క్యారెట్‌ ముక్కలు – అర కప్పు
ఓట్స్‌ – అర కప్పు
పచ్చి బఠాణీలు – అర కప్పు
కొత్తిమీర – అర కప్పు
పచ్చిమిర్చి – 1
వాల్‌నట్స్‌ – ఒక కప్పు
బంగాళదుంపలు – 21
అల్లం పేస్ట్ -1టీ స్పూన్‌
కారంం – 1టీ స్పూన్‌
జీలకర్ – 1టీ స్పూన్‌
పసుపు – 1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీవిధానం :
ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, పచ్చి బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వాల్‌నట్స్‌ అన్నీ మిక్సీ పట్టుకోవాలి.. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బంగాళదుంప గుజ్జు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఓట్స్‌ పౌడర్‌. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. తగినంత ఉప్పు కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు జోడించి ముద్దలా చేసుకుని.. చిన్న చిన్న కట్లెట్స్‌ తయారు చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించి వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.