Site icon HashtagU Telugu

Chicken Potato Nuggets: వెరైటీ చికెన్ పొటాటో నగ్గెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?

Chicken Potato Nuggets

Chicken Potato Nuggets

చికెన్ ప్రేమికులు ఇప్పుడు చికెన్ కబాబ్,చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ,చికెన్ తందూరి ఇలా ఎప్పుడూ ఒకటే రకమైన వంటలు కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త వంటలు తెలియక చాలామంది ఎప్పటిలాగే చేసుకుని వండుకొని తింటూ ఉంటారు. ఒకవేళ మీరు చికెన్ తో కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ ఇంట్లోనే తయారు చేసుకోండి. చాలామంది ఈ పేరు కూడా విని ఉండరు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ తయారీకి కావలసిన పదార్థాలు :

బోన్‌లెస్‌ చికెన్‌ – అర కప్పు
బంగాళదుంపలు – 2
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్ చొప్పున
మిరియాల పొడి – 1 టీ స్పూన్‌
గరం మసాలా – అర టీ స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తురుము – కొద్దిగా
మొక్కజొన్న పిండి – 3 టేబుల్‌ స్పూన్లు
గుడ్లు – 2
బ్రెడ్‌ పౌడర్‌ – గార్నిష్‌ కోసం
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్‌లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, మొక్కజొన్న పిండి, చికెన్‌ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చతురస్రాకారంగా, లేదా మీకు నచ్చిన విధంగా ఆకారంలో ఒత్తుకోవాలి. వీటిని ముందుగానే గుడ్డు, పాలు కలిపిన మిశ్రమంలో ముంచి బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా వేడివేడిగా ఉండే చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ రెడీ.