సాధారణంగా మనం బయట ఎక్కువగా తిరిగినప్పుడు లేదంటే టెన్షన్ పడినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు ముఖంపై చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. చెమట రావడంతో పాటుగా చర్మం కూడా జిడ్డుగా మారుతూ ఉంటుంది. దీంతో కొంతమంది తరచూ ముఖం కడుగుతూనే ఉంటారు. కొంతమంది అయితే రోజులో కనీసం ఒక ఏడు ఎనిమిది సార్లు అయినా ముఖాన్ని కడుగుతూ ఉంటారు. అయితే ముఖం కడుక్కోవడం మంచిదే కానీ ఎక్కువగా ముఖం కడుక్కోవడం అంత మంచిది కాదు అంటున్నారు. మరి ముఖ్యంగా వేసవికాలంలో ముఖాన్ని తరచుగా కడుక్కోవడం అసలు మంచిది కాదు. ఎందుకంటే ముఖం కడుక్కునప్పుడు ఫేస్ వాష్ లేదా క్లీనర్స్ ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బ తినడంతో పాటు మొటిమల సమస్య తలెత్తుతూ ఉంటుంది.
మరి తరచూ ముఖం కడుక్కోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తరచూ ముఖం కడుక్కుంటూ ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి. చర్మంపై ముడతలు కనిపించడం, గరుకుదనం కారణంగా చర్మం సాగుతున్నట్లు అనిపించడం లాంటివి కనిపిస్తాయి. మరి ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి పదేపదే ముఖం కడగడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తరచూ ముఖం కడగడం వల్ల ముఖంపై తేమ ఉంటుంది. అలాగే పొడిగా మారి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ముఖం కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారి చర్మం గ్లో ని దెబ్బతీస్తుంది. అందుకే ముఖం పదే పదే కడిగేటప్పుడు ఎక్కువగా ఫేస్ వాష్లను ఉపయోగించకూడదు.
కాగా తరచుగా ఫేస్ వాష్ చేయడం వల్ల ఈ మైక్రోఫ్లోరాస్ ల సంఖ్య తగ్గి చర్మం సహజ ప్రకాశాన్ని కూడా కోల్పోతుంది. ముఖం కడిగిన ప్రతిసారీ కెమికల్ ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలో చిరాకు, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలా తరచూ ముఖం కడిగే అలవాటుని దీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల మీ చర్మం ముసలి వారి చర్మంల కనిపిస్తూ ఉంటుంది. పదే పదే ముఖం కడుక్కోకూడదు. ఒకవేళ మీ చర్మం పై మొటిమలు దద్దుర్లు ఉన్నట్లు అయితే మీ ముఖాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు కంటే ఎక్కువ కడగకూడదు. ముఖం పై జిడ్డు చర్మం,బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నట్లు అయితే ఎక్కువగా ఫేస్ వాష్ చేయడానికి మానుకోవాలి.