Site icon HashtagU Telugu

Summer: వేసవికాలంలో ముఖాన్ని ఎన్ని సార్లు శుభ్రం చేసుకోవాలో తెలుసా?

Summer

Summer

వేసవికాలం వచ్చింది అంటే చాలు విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు స్నానం చేసినప్పటికీ చెమట మాత్రం అలాగే వస్తూ ఉంటుంది. అందుకే చాలామంది పదేపదే ముఖాన్ని శుభ్రం చేసుకోవడం లేదంటే రోజుకి రెండుసార్లు స్నానం చేయడం లాంటివి చేస్తుంటారు. అందంగా ఉండాలని, జిడ్డును పోగొట్టాలని చాలా మంది రోజుకు ఏడెనిమిది సార్లైనా సబ్బుతో ముఖాన్ని కడుగుతూనే ఉంటారు. కానీ ఇలా కడగడం చర్మ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. చర్మ రకం, జీవనశైలిని బట్టి రోజుకు రెండు లేదా మూడు సార్లు ఫేస్ వాష్ తో కడగాలని, అలాగే ఒకసారి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలని చెబుతున్నారు.

మాములుగా ఉదయం నిద్రలేవగానే ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలట. ఇది రాత్రిపూట మీ చర్మం విడుదల చేసే నూనెలు, మీ ముఖంపై ఉండే టాక్సిన్స్, దిండు వల్ల అంటుకున్న దుమ్మును తొలగిస్తుందట. ఆ తరువాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మేకప్ వేసుకునే ముందు మీ ముఖాన్ని మళ్లీ కడగాలని చెబుతున్నారు. అలాగే మీరు జిమ్ కు వెళ్లినట్టైతే లేదా ఆయిలీ స్కిన్ ఉంటే ఫేస్ వాష్ తో శుభ్రం చేయాలి. లేదా సాధారణ, పొడి, సున్నితమైన చర్మం ఉంటే నార్మల్ వాటర్ తో కడగాలని చెబుతున్నారు. మూడవసారి రోజువారి మేకప్, దుమ్ము, కాలుష్యం, చెమట మొదలైన వాటిని వదిలించుకోవడానికి ఉపయోగడపడుతుందట.

ఈ సమయంలో ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలట. మీరు మేకప్ ఉపయోగించినా, ఆరు బయట పనిచేస్తున్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా లేదా పగటిపూట చెమట ఎక్కువగా పట్టినా క్లెన్సింగ్ బామ్ లేదా సూపర్ మైల్డ్ క్రీమీ ఎక్స్ఫోలియేటర్ ను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ముఖాన్ని కడగాలట. ఈ టైంలో మీరు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలని చెబుతున్నారు. రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్ దుమ్ము, నూనె, మలినాలు, క్రిములు, చనిపోయిన చర్మ కణాలు, మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారితీసే ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుందట.

ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తాజా రూపం ఏర్పడుతుందట. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి సరిగ్గా బాగా వెళతాయని, క్రమం తప్పకుండా ముఖాన్నిశుభ్రం చేయడం వల్ల అదనపు నూనెల ఉత్పత్తి తగ్గుతుందని చెబుతున్నారు. కాగా చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించి ప్రతిరోజూ ముఖాన్ని కడగాలని చెబుతున్నారు. తగినంత ఆర్ద్రీకరణ చర్మ ఎరుపు, పొడి, చికాకును కలిగిస్తుందట. మీ చర్మం వృద్ధాప్యంగా కనిపిస్తుందట. అలాగే తరచూ ఏడు ఎనిమిది సార్లు సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల స్కిన్ డ్రైగా అయిపోతుందని చెబుతున్నారు.