ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?

సరిగ్గా ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే గరిష్టంగా 7 రోజుల వరకు తినవచ్చు. గుడ్లు పొట్టుతో ఉన్నా లేదా పొట్టు తీసినా ఈ నియమం వర్తిస్తుంది. అయితే రుచి, పోషక విలువలు పరంగా చూస్తే 2 నుంచి 3 రోజులలోపు గుడ్లను తినడం ఉత్తమం.

Published By: HashtagU Telugu Desk
How many days can boiled eggs be stored? How long is it best to eat them?

How many days can boiled eggs be stored? How long is it best to eat them?

. ఉడికించిన గుడ్లు ఎంతకాలం నిల్వ ఉంటాయి?

. ఫ్రిజ్‌లో సరైన విధంగా ఎలా భద్రపరచాలి?

. చెడు గుడ్లను గుర్తించే లక్షణాలు

Boiled Eggs : ఉడికించిన గుడ్లు ప్రోటీన్‌తో నిండిన పోషకాహారం. అయితే సరైన విధంగా నిల్వ చేయకపోతే ఇవే ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. గుడ్లను ఎంతకాలం తినవచ్చు, ఎలా భద్రపరచాలి, పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తించాలి అనే అంశాలపై చాలామందికి స్పష్టత ఉండదు. ఈ నేపథ్యంలో ఉడికించిన గుడ్ల నిల్వకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. సరిగ్గా ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే గరిష్టంగా 7 రోజుల వరకు తినవచ్చు. గుడ్లు పొట్టుతో ఉన్నా లేదా పొట్టు తీసినా ఈ నియమం వర్తిస్తుంది. అయితే రుచి, పోషక విలువలు పరంగా చూస్తే 2 నుంచి 3 రోజులలోపు గుడ్లను తినడం ఉత్తమం.

సగం ఉడికించిన (హాఫ్ బాయిల్డ్) లేదా మెత్తగా ఉడికించిన గుడ్లు ఎక్కువకాలం నిల్వ ఉండవు. ఇలాంటి గుడ్లలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అదే రోజు లేదా గరిష్టంగా మరుసటి రోజే తినడం మంచిది. ఎక్కువ రోజులు ఉంచడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు బయట ఉంచడం చాలా పెద్ద తప్పు. గుడ్లు ఉడికిన వెంటనే వాటిని చల్లటి నీటిలో వేసి త్వరగా చల్లబరచాలి. దీని వల్ల లోపలి ఉష్ణోగ్రత తగ్గి బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది.

చల్లబడిన తర్వాత 2 గంటలలోపు గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం తప్పనిసరి. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గంటలోపే ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే గుడ్లు సురక్షితంగా ఉంటాయి. చాలామంది సౌలభ్యం కోసం గుడ్ల పొట్టును ముందే తీసేస్తారు. కానీ ఇది అంత మంచిపద్ధతి కాదు. గుడ్డు పెంకు సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది ఫ్రిజ్ వాసనలు, హానికర బ్యాక్టీరియా నుంచి గుడ్లను కాపాడుతుంది. ముందే వలిచిన గుడ్లను చల్లటి నీటిలో లేదా తడి టిష్యూతో గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. ఉడికించిన గుడ్లు పాడయ్యాయా లేదా తెలుసుకోవడం చాలా అవసరం. గుడ్డు నుంచి ఘాటైన లేదా కుళ్లిన వాసన వస్తే వెంటనే దాన్ని పారవేయాలి. అలాంటి గుడ్లు తినడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు.

కొన్ని సందర్భాల్లో గుడ్డు పచ్చసొన చుట్టూ ఆకుపచ్చ లేదా బూడిద రంగు వలయం కనిపించవచ్చు. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది గుడ్డు పాడైందని అర్థం కాదు. గుడ్డును ఎక్కువసేపు ఉడకబెట్టడం లేదా నీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి గుడ్లు తినడానికి పూర్తిగా సురక్షితమే. ముఖ్యంగా ఉడికించిన గుడ్లను ఫ్రిజ్ తలుపుపై ఉన్న ట్రేలో ఉంచకూడదు. తలుపులు తరచూ తెరుచుకోవడం వల్ల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. దీని వల్ల గుడ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. గుడ్లను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలో, గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

 

  Last Updated: 08 Jan 2026, 05:57 PM IST