Site icon HashtagU Telugu

Towels Cleaning : మనం రోజూ ఉపయోగించుకునే టవల్ ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా?

how many days after the towel we use every day should be washed?

how many days after the towel we use every day should be washed?

మనం రోజూ టవల్(Towel) ను ఉపయోగిస్తాము. అయితే రోజు ఉపయోగించే దానిని కొంతమంది రోజూ ఉతుకుతారు, కొంతమంది వారానికి ఒకసారి ఉతుకుతారు. కానీ మనం వాడే టవల్ ను ఎప్పుడు ఉతకాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా?. సాధారణంగా మనం రోజూ వాడే టవల్స్ వారానికి మూడు సార్లు ఉతకడం మంచిది. మనం టవల్ ను ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చిన తరువాత, ముఖం కడుక్కున్న(Face Wash) తరువాత, స్నానం(Bath) చేసిన తరువాత ఉపయోగిస్తుంటాము. అయితే మనం బయటకు వెళ్లి వచ్చిన తరువాత వాడిన టవల్ ను మరునాడు ఉతకడం మంచిది లేకపోతే ఆ టవల్ లో క్రిములు మన చర్మానికి హాని కలుగజేస్తాయి. అలాగే మనం ఎప్పుడైనా ఒక టవల్ ను కనీసం మూడు రోజులు వాడిన తరువాత అయినా ఉతకడం మంచిది.

మనం ఒకసారి టవల్ ఉపయోగించేటప్పుడు అది తడిగా ఉందా లేదా పొడిగా ఉందా అనేది చూసుకోవాలి. తడిగా ఉంటే ఆ టవల్ ని మనం వాడితే దాని ద్వారా మన శరీరంలోనికి క్రిములు వస్తాయి. తడిగా ఉన్న టవల్ వాడడం వలన చర్మంపైన దద్దుర్లు, మొటిమలు, దురదలు వంటివి వస్తాయి. కాబట్టి మనం ఒకసారి వాడుకున్న టవల్ ను ఎండలో ఆరబెట్టుకోవాలి. టవల్ ఆరబెట్టకుండా వాడితే మన శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది దాని వలన మనం అనారోగ్యానికి గురవుతాము. మురికి టవల్ ను మనం పదే పదే వాడడం వలన మనం అనారోగ్యానికి గురవుతాము. అలాగే స్నానానికి ఒక టవల్, అప్పుడప్పుడు ఫేస్, చేతులు తుడుచుకోవడానికి మరో టవల్ వాడాలి.

టవల్ ను మనం ఏదైనా టూర్ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తుంటాము అలా తీసుకెళ్ళిన వాటిని మనం మళ్ళీ ఉతికిన తరువాతే ఉపయోగించాలి లేదంటే ఆ టవల్ లో ఉండే మురికి మన శరీరానికి పడుతుంది. దాని వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం టవల్ ని ఎక్కడికైనా తీసుకువెళ్లిన తరువాత మరియు మనం ఇంట్లో కనీసం మూడు రోజులు వాడుకున్న తరువాత ఖచ్చితంగా టవల్ ను ఉతకాలి లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది.

 

Also Read :   Donkey Milk : గాడిద పాలతో ఎన్ని లాభాలో.. తెలిస్తే మీరూ మిస్ చేయరు