Site icon HashtagU Telugu

Sweet Potato Cutlet: వెరైటీగా చిలగడదుంపతో తియ్యటి కట్ లెట్.. తయారీ విధానం ఇదే?

Sweet Potato Cutlet

Sweet Potato Cutlet

మామూలుగా చాలామంది కట్‌లెట్‌ అనగానే స్పైసీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆలు కట్‌లెట్‌, చికెన్ కట్‌లెట్‌ లు ఎంతో స్పైసీగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మీరు స్పైసీగా కాకుండా తీయగా ఉండే కట్‌లెట్‌ ను తిన్నారా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి ఎంతో టేస్టీగా తీయగా ఉండే కట్‌లెట్‌ ను ఏ విధంగా తయారు చేసుకోవాలి అందుకోసం ఏమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తీయని కట్‌లెట్‌ కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియంట్ చిలగడదుంప.

తియ్యటి కట్‌లెట్‌ కావలసినవి పదార్థాలు:

నానపెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు
చిలగడ దుంప – పెద్దది ఒకటి
వడగట్టిన సొరకాయ తురుము – పావు కప్పు
జీడిపప్పు పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు
పుదీనా ఆకులపొడి – టీస్పూను
జీలకర్ర పొడి – టీస్పూను
కారం – అరటీస్పూను
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా చిలగడ దుంపను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి. తరువాత మెత్తగా చిదుముకున్న దుంప మిశ్రమంలో మిగతా పదార్థాలన్నింటిని వేసి చక్కగా కలపాలి . ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్‌ రాసుకుని మిశ్రమాన్ని కట్‌లెట్‌లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత కట్‌లెట్‌లను వేసి రెండువైపులా క్రిస్పీ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు కాల్చాలి. ఇలా చేస్తే తియ్యటి కట్‌లెట్‌ రెడీ.