Site icon HashtagU Telugu

Milk Daal Halwa: ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ దాల్ హల్వా.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Milk Daal Halwa

Milk Daal Halwa

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్వీట్, హాట్ రెండింటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లలు భర్తలు స్కూల్ నుంచి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఏదైనా తినడానికి స్నాక్స్ రూపంలో స్వీట్లు, హాట్ అడుగుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఉండే మహిళలు ఎటువంటి స్వీట్ చేసి పెట్టాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ రెసిపీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే మిల్క్ దాల్ హల్వా తయారు చేయాలి? అందుకోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిల్క్‌ దాల్‌ హల్వాకి కావల్సిన పదార్థాలు :

చిక్కటి పాలు – సరిపడినన్ని
పుట్నాల పప్పు – 2 కప్పులు
పంచదార – 2 కప్పులు
జీడిపప్పులు –10
నెయ్యి – 5, 6 టేబుల్‌ స్పూన్లు
ఏలకులు – 2

మిల్క్‌ దాల్‌ హల్వా తయారీ విధానం :

ఒక పాత్రలో పాలు వేడి చేసుకుని అందులో పుట్నాల పప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ, చిన్న మంట మీద, పాలను ఒక పొంగు రానివ్వాలి. వెంటనే మరోసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. పాలు చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో జీడిపప్పు, పంచదార, ఏలకులు వేసుకుని మరోసారి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత ఒక పాత్రను ఒకసారి క్లీన్‌ చేసుకుని స్టవ్‌ మీద పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి కాగానే పాలు, పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకూ తిప్పుతూ ఉండాలి.
దగ్గర పడగానే స్టవ్‌ ఆఫ్‌ చేసి, చివరిగా మిలిగిన కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి. అనంతరం నచ్చిన పాత్రకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసి చదును చెయ్యాలి. కాసేపటికి ముక్కలు కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్‌ దాల్‌ హల్వా రెడీ.

Exit mobile version