మామూలుగా మనం ఇంట్లో బయట అనేక రకాల వడలను తింటూ ఉంటాం. మిరపకాయ వడ, ఆకు కూర వడ, అలసంద వడ, శనగపిండి వడ, పకోడీ, ఇలా అనేక రకాల వడలను తిని ఉంటాం. వీటితోపాటుగా అప్పుడప్పుడు చాలామంది కాస్త డిఫరెంట్ గా కూడా వడలను ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడూ ఒకటే రకం కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయమని అడుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు కొబ్బరి వడలు తిన్నారా. ఒకవేళ ఎప్పుడూ ట్రై చేయకపోతే ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి వడల తయారీకి కావలసినవి పదార్థాలు :
కొబ్బరి కోరు – అర కప్పు
బియ్యం – 1 కప్పు
జీలకర్ర – 1 టీ స్పూన్
బియ్యప్పిండి – 1/3 కప్పు
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
కొబ్బరి వడలు తయారీ విధానం:
ముందుగా మిక్సీ బౌల్‌లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో కొబ్బరికోరు, ఉప్పు వేసుకుని ఈసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో బియ్యప్పిండి వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఒక అరటి ఆకుపైన లేదా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ మీద చిన్నచిన్న ఉండల్ని అప్పడాల్లా ఒత్తుకుని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి నూనెలో పడగానే పూరీల్లా పొంగుతాయి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి కొబ్బరి వడలురెడీ.