Fish Omelette Rolls: ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఆమ్లెట్ రోల్స్.. తయారు చేయండిలా?

చాపలు ఇష్టపడని వారు ఉండరేమో. కొందరు మాత్రమే చాపలు వాసన వస్తాయి, అందులో ముల్లులు ఉంటాయి అని వాటిని తినకుండా ఉంటారు. అయితే చాపలతో ఎప్పుడు పుల

  • Written By:
  • Updated On - July 3, 2023 / 04:24 PM IST

చాపలు ఇష్టపడని వారు ఉండరేమో. కొందరు మాత్రమే చాపలు వాసన వస్తాయి, అందులో ముల్లులు ఉంటాయి అని వాటిని తినకుండా ఉంటారు. అయితే చాపలతో ఎప్పుడు పులుసు, లేదా కబాబ్ లాంటివి మాత్రమే కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు చాపలతో కొత్త వంటకం చేయాలి అనుకుంటే ఇది మీ కోసమే. చాపలతో టేస్టీ ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీకి కావలసిన పదార్థాలు :

చేప ముక్కలు – 2
గుడ్లు – 3,
కారం – తగినంత
పసుపు – తగినంత
ఉప్పు– తగినంత
అల్లం,వెల్లుల్లి పేస్ట్‌ – అర టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా
గరం మసాలా – 1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తురుము – కొద్దిగా
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా చేప ముక్కలపై కారం, పసుపు, ఉప్పు కొద్దికొద్దిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం కడాయిలో నూనె వేడి చేసుకుని, దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ముళ్లు తొలగించి పొడిపొడిగా చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పెనం మీద నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించి చేప మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. కొత్తిమీర తురుము కూడా వేసుకుని ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకోవాలి. అనంతరం పాన్‌ మీద కొద్దిగా నూనె వేసుకుని, ప్లెయిన్‌ ఆమ్లెట్స్‌ వేసుకుని వాటిలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్స్‌లా చుట్టాలి. ఆ తర్వాత సర్వ్‌ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఫిష్‌ ఆమ్లెట్స్‌ రోల్స్‌ రెడీ.