Site icon HashtagU Telugu

Chilakada Dumpa Poorilu: ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంపల పూరి.. తయారు చేయండిలా?

Chilakada Dumpa Poorilu

Chilakada Dumpa Poorilu

మామూలుగా మనం గోధుమపిండితో తయారు చేసిన పూరీలను ఎక్కువగా తింటూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు గోధుమపిండి లేనప్పుడు మైదాపిండితో కూడా పూరీలను చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఒకటే రకం పూజలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలని చాలామంది వింత వింతగా పూరీలు ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో చిలగడ దుంపల పూరి కూడా ఒకటి. వినడానికి కాస్త భిన్నంగా ఉన్న ఈ పూరీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి చిలగడదుంపల పూరీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చిలగడదుంపల పూరీకి కావలసినవి పదార్థాలు :

చిలగడదుంపలు – 2
గోధుమ పిండి –2 కప్పులు
గోరువెచ్చని నీళ్లు – సరిపడా
మైదాపిండి – 1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తురుము – 2 టేబుల్‌ స్పూన్లు
కారం – 1 టీ స్పూన్‌
పసుపు – చిటికెడు
గరం మసాలా – 1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్‌ తీసుకొని, అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్‌ నూనె వేసుకోవాలి. అలాగే సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ గా ఉండే చిలగడదుంప పూరి రెడీ.