Site icon HashtagU Telugu

Chicken Omelette: ఎప్పుడైనా చికెన్ ఆమ్లెట్ తిన్నారా.. తయారు చేసుకోండిలా?

Chicken Omelette

Chicken Omelette

మామూలుగా మనం చికెన్ తో రకరకాల ఐటమ్స్ ని తింటూ ఉంటాం. చికెన్ ఫ్రై, కబాబ్,చికెన్ బిర్యాని, చికెన్ కర్రీ, చికెన్ తందూరీ ఇలా చికెన్ తో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని మరి తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా కూడా చికెన్ ఆమ్లెట్ తిన్నారా. వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి అందుకే ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

చికెన్‌ ఆమ్లెట్‌ తయారీకి కావలసినవి పదార్థాలు:
గుడ్లు – నాలుగు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాలపొడి – రుచికి సరిపడా
నూనె – టీస్పూను
తురిమిన చికెన్‌ – ముప్పావు కప్పు
ఛీజ్‌ తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు
పాలకూర తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం :

ముందుగా గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే బాగా కలుపుకున్న గుడ్ల సొనలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు పాన్‌పై నూనెవేసి వేడెక్కిన తరువాత గుడ్ల సొన మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకోవాలి. ఆమ్లెట్‌ మధ్యలో నుంచి అంచుల వరకు చక్కగా కాలేలా సొనను పరుచుకుంటూ సన్నని మంట మీద కాల్చాలి. ఇప్పుడు చికెన్‌ తరుగుని అవెన్‌లో కాస్త వేడి చేసి ఆమ్లెట్‌పైన వేయాలి. చికెన్‌తోపాటు చీజ్‌ తరుగు, పాలకూర తరుగు వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఆమ్లెట్‌ను సగభాగం మడిచి చీజ్‌ కరిగేంత వరకు రెండు వైపులా చక్కగా కాల్చాలి. చక్కగా కాలిన ఆమ్లెట్‌ను ఫ్రైడ్‌ బ్రెడ్, స్పినాచ్‌ సలాడ్‌తో సర్వ్‌ చేసుకోవాలి. అంతే టేస్టీగా స్పైసీగా ఉంది చికెన్ ఆమ్లెట్ రెడీ.