Site icon HashtagU Telugu

Capsicum Bajji: ఎంతో ఈజీగా ఇంట్లోనే క్యాప్సికం బజ్జీలు.. తయారు చేయండిలా?

Capsicum Bajji

Capsicum Bajji

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తొలకరి జల్లుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ చల్లటి వాతావరణానికి సాయంత్రం సమయంలో ఏదైనా వేడివేడిగా తినాలని పిల్లలు కూడా ఆశపడుతూ ఉంటారు. వర్షం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే కాంబినేషన్ బజ్జీలు లేదా టీ. ఈ రెండింటి కాంబినేషన్ ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ మైసూర్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు మాత్రమే కాకుండా వెరైటీగా కాస్త పిల్లల కోసం ఇంట్లో వారి కోసం క్యాప్సికం బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్యాప్సికమ్‌ బజ్జీ కావలసినవి పదార్థాలు :

క్యాప్సికమ్‌ – 6 లేదా 8
శనగపిండి – 1 కప్పు
ఉప్పు – తగినంత
కారం – 1 టీ స్పూన్
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – అర టీ స్పూన్
వంట సోడా – కొద్దిగా
క్యారెట్‌ ముక్కలు – కొద్దిగా
బీట్‌ రూట్‌ ముక్కలు – కొద్దిగా
కొత్తిమీర తురుము – కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :

ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోడా, ఉప్పు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే అంతకంటే ముందుగా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కొత్తిమీర తురుము ఉల్లిపాయ ముక్కలుకాస్త ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక్కో క్యాప్సికమ్‌ తీసుకుని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.. చల్లారిన తరువాత చాకుతో ఒక వైపు కట్‌ చేసుకుని అందులో క్యారెట్‌ ముక్కల మిశ్రమాన్ని నింపుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. అంతే ఎంతో వేడివేడిగా ఉండే క్యాప్సికం బజ్జీలు రెడీ.

Exit mobile version