చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే తినే వాటిలో కేక్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో ప్రతి చిన్న సెలబ్రేషన్స్ కి కేక్ అన్నది తప్పనిసరి. పుట్టినరోజు వేడుకలకు, పెళ్లిరోజు వేడుకలకు, పెళ్లిరోజు, ఏదైనా అచీవ్మెంట్స్ సాధించినప్పుడు ఇలా మంచి మంచి సందర్భాలలో కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అయితే కేక్ ని ఇష్టపడని వారు ఉండరు. కానీ కేక్ ని ఎప్పుడు ఒకే విధంగా ఒకే టేస్ట్ తో కాకుండా చాలామంది రకరకాల కేకులను తినాలని పడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఉండే మహిళలు అయితే కేక్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసి పిల్లలకు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం ఒక చక్కటి రెసిపీ. ఇంట్లోనే సింపుల్గా బనానా కాఫీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బనానా కాఫీ కేక్ కి కావాల్సిన పదార్థాలు :
అరటిపండ్లు – 2
బ్రౌన్ సుగర్ – 1 కప్పు,
నూనె – అర కప్పు
మైదాపిండి – 1 కప్పు
బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్
పాలు – అర కప్పు,
చాక్లెట్ చిప్స్ – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా అరటిపండు ముక్కలు, నూనె, బ్రౌన్ సుగర్ మిక్సీ బౌల్‌లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్‌లా బాగా కలుపుకోవాలి. తర్వాత నచ్చిన షేప్‌లో ఉండే బేకింగ్ బౌల్ తీసుకుని దానిలోపల నూనె పూయాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లో వేసుకుని.. చాక్లెట్ చిప్స్ జల్లుకుని ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా కాఫీ కేక్ రెడీ.