Site icon HashtagU Telugu

Beauty Tips: లిఫ్ స్టిక్ వాడటం మంచిదేనా.. ఒక లిప్స్టిక్ ఎన్ని రోజులు ఉపయోగించాలో తెలుసా?

Beauty Tips

Beauty Tips

అమ్మాయిలు ఎక్కువగాలిప్ స్టిక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు కొంచెం లేటుగా ఉపయోగిస్తే మరి కొందరు మాత్రం పెదవులు బాగా కనిపించాలి ఆకర్షణీయంగా కనిపించాలి అని తిక్కుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే ఇందులో రకరకాల ఫ్లేవర్లను ఎంచుకోవడంతో పాటు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే లిప్ స్టిక్ వాడడం మంచిదే అయినా వాటిని ఉపయోగించే ముందు ఎన్నో రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. మరి లిప్ స్టిక్ వాడే వాళ్ళు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా లిప్ స్టిక్ అనేది ఒక సంవత్సరం వరకూ వాడవచ్చు. అంతకు మించి వాడకూడదు. దీన్ని రెగ్యులర్‌గా వేసుకుంటే ఇది కూడా అన్నీ రోజులు రాదు.. కానీ, కొంతమంది రెగ్యులర్‌గా వేసుకోరు. మరి కొంతమందికి ఎన్నో కలర్స్ ఉంటాయి. వీటిలో ఒక్కోసారి ఒక్కో కలర్ లిప్ స్టిక్ వాడుతారు. దీని వల్ల అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయినప్పటికీ అలా ఉన్నా సంవత్సరానికి మించి వాడటం మంచిది కాదు. ఇలా వాడితే పెదాలు నల్లగా మారడం, పగలడం, పొడి బారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎక్కువరోజులు వాడకపోవడమే మంచిది. అలాగే లిప్ స్టిక్ వాడే ముందు దాన్ని ఎక్స్పైరీ డేట్ చూడడం కూడా మంచిది.

ఎందుకంటే లిప్ స్టిక్ డేట్ అయిపోయినవి ఉపయోగిస్తే పెదవులకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి లిప్ స్టిక్ ని ఉపయోగించే ముందు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.