Relationship: మీ భార్య మిమ్మల్ని పట్టించుకోవడం లేదా, అయితే జరిగేది ఇదే..!!

పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు పురుషులకు మాత్రమే కాదు...స్త్రీలకు కూడా తమ భర్తల పట్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గుతుంది.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 08:00 PM IST

పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు పురుషులకు మాత్రమే కాదు…స్త్రీలకు కూడా తమ భర్తల పట్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గుతుంది. కానీ వారు అంత సులభంగా బయటపడరు. అసలు తమ భాగస్వామి పట్ల ఆసక్తి లేకపోతే…మహిళ ఎలా ప్రవర్తిస్తుంది. ఆ విషయాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లై కొత్తలో దంపతుల మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది. రోజులు గడుస్తుంటే ఆ ప్రేమ, ఆసక్తి తగ్గిపోతుంది. పురుషులకు మాత్రమే తమ భార్యల పట్ల ఇంట్రెస్ట్ తగ్గుతుందనుకుంటారు. కానీ వాస్తవానికి పురుషులకు మాత్రమే కాదు..స్త్రీలకు కూడా తమ భర్తల పట్ల ఆసక్తి తగ్గుతుందట. కానీ వారు అంత ఈజీగా బయటపడరు. తమ భాగస్వామిపట్ల ఆసక్తి లేకుంటే..ఎలా ప్రవర్తిస్తుంది..?

*మహిళల్లో సాధారణంగా జెలసీ ఉంటుంది. ఇది కామన్. తమ భర్తకు ఎవరైన దగ్గరవ్వాలని చూసినా…మాట్లాడినా..జెలసీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా భర్త విషయంలో భార్య జెలసీగా ఫీలవ్వడం లేదంటే ఆలోచించాల్సిందే. భర్తఎవరితో మాట్లాడినా పట్టించుకోలేదంటే…భర్త మీద ఆసక్తి తగ్గినట్లే.

*స్త్రీలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. భర్త విషయంలో ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రశ్నలతో వారిని విసిగిస్తారు. అలాకాకుండా…సైలెంట్ గా ఉండటం..పొడిపొడిగా మాట్లాడుతున్నారంటే…మీ మీద ఆసక్తి తగ్గిందనే అర్థం.

*చాలామంది తమ భర్త ఇలా ఉండాలి..అలా ఉండాలనుకుంటారు. వారికి నచ్చకపోతే…గడ్డం పెరిగిన సహించరు. అదే ఆసక్తి తగ్గింనుకోండి…గడ్డం పెంచేసినా..నచ్చని దుస్తువులు ధరించినా…ఏం పట్టనట్లు ఉంటారు.

*తమతో సమయం గడపకుండా…బిజీబిజీగా ఉండే భర్తను మాత్రం ఆడవారు అస్సలు సహించరు. అలాంటిది మీరు గంటలతరబడి వర్క్ తో గడుపుతున్నా పట్టించుకోవడం లేదంటే..వారికి మీ మీద ఆసక్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి.

*మరీ ముఖ్యంగా పడకగది విషయంలో దూరం పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇష్టం లేకుంటే స్త్రీలు ఎలాంటి విషయాలు పట్టించుకోరు.
*భార్యభర్తలు అన్నాక …చిన్న చిన్న పొరపాట్లు కామన్. అలాంటిది జరిగినప్పుడు మనం వెంటనే భాగస్వామికి సారీ చెబుతాం. అలా కాకుండా మీ భార్య మరోలా ప్రవర్తిస్తున్నారంటే కచ్చితంగా మీరు ఆలోచించాల్సిందే.