అండర్ ఆర్మ్స్ హెయిర్ ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. లేదంటే చెమట, డెబ్ స్కిన్ సెల్స్ ఏర్పడతాయి. అందుకే, అండర్ ఆర్మ్స్ ప్రాంతం ఇతర ప్రాంతాల కంటే కొద్దిగా ముదురు రంగులో ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అండర్ ఆర్మ్ ప్రాంతాన్ని క్లీన్ చేయడం మంచిది. అలా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్స్‌ఫోలియేషన్ అనేది చాలా ముఖ్యమైనది. దీని వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. అయితే, అండర్ ఆర్మ్, ప్రైవేట్ పార్ట్స్‌లో ఎక్స్‌ఫోలియేట్ చేయం. దీని వల్ల అక్కడ చెమట పట్టడం, నల్లగా మారడం జరుగుతుంది. జుట్టు కూడా తీయపోతే అనేక సమస్యలు వస్తాయి.
అండర్ ఆర్మ్ స్కిన్ మిగతా ప్రాంతంలో స్కిన్ కంటే కాస్తా గరుకుగానే ఉంటుంది. దీనికి ముఖ్య కారణం చెమట పేరుకుపోయి మృతకణాలు పేరుకుపోతాయి. ఈ మృతకణాలని తొలగించడం మంచిది. మీ అండర్ ఆర్మ్ హెయిర్‌ని షేవ్ చేయడం మంచిది. షేవింగ్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఒకటి అదేంటంటే రేజర్‌ని మళ్ళీ మళ్ళీ వాడడం. ఎందుకంటే, ఎంత క్లీన్ చేసినా దానిపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్‌గా క్లీన్ చేయమని చెప్పాం కదా అని మరీ ఎక్కువగా క్లీన్ చేయవద్దు. దీని వల్ల చర్మం కొద్దిగా గరుకుగా మారి, వెంట్రుకలు దట్టంగా పేరుకుపోతాయి.
అలానే జుట్టు మన చర్మానికి రక్షణ పొరగా కూడా జుట్టు ఉంటుంది. కాబట్టి, మరీ రెగ్యులర్‌గా షేవింగ్ చేయవద్దు. షేవింగ్ చేసేటప్పుడు షేవింగ్ క్రీమ్స్ వాడడం మంచిది. అలా క్రీమ్ అప్లై చేయకపోతే కనీస సబ్బు, నీటిని స్ప్రే చేసి చేస్తుంటారు. కానీ అలా చేయవద్దు. దీని వల్ల చర్మం పొడిగా మారుతుంటుంది. అలా కాకుండా క్రీమ్ వాడితే స్కిన్ అలానే ఉంటుంది. షేవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. లేకపోతే గాయాలయ్యయే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తగా చేయాలిని, మీ చేతుల పొజిషన్ కూడా సరిగ్గా ఉంచుకోవాలి.
