షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయులను కంట్రోల్ లో ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే
గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, కిడ్నీ సమస్యలు, కంటి ప్రాబ్లమ్స్, నాడీ వ్యవస్థలో లోపం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మందులు, ఇన్సులిన్‌పైనే ఎక్కువగా ఆధారపడతారు.మన ఇంటి వంట గదిలో ఉండే దాల్చిన చెక్క.. షుగర్ పేషెంట్స్‌కు ఔషధంలా పని చేస్తుందని హోమియోపతి వైద్య నిపుణులు అంటున్నారు. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయని తెలిపారు.
దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని న్యూట్రల్ చేస్తుంది. దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే.. పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క నీరు..
డయాబెటిస్ పేషెంట్స్ దాల్చిన చెక్కను నీటిలో వేసుకుని తాగడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఒక గ్లాసు నీటిలో 2-అంగుళాల దాల్చిన చెక్కను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీరు తాగండి.
దాల్చినచెక్కతో ఈ సమస్యలకూ చెక్..
* దాల్చినచెక్క రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.
* కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
* కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
* ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
* ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది.