Feet: వర్షాకాలంలో పాదాల పగుళ్ల సమస్యనా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

వర్షాకాలం మొదలైంది అంటే చాలు, చాలామంది స్త్రీ పురుషులకు పాదాల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాదాల్లు పగిలి రాత్రి స

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 10:40 PM IST

వర్షాకాలం మొదలైంది అంటే చాలు, చాలామంది స్త్రీ పురుషులకు పాదాల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాదాల్లు పగిలి రాత్రి సమయంలో నొప్పి ఎక్కువ అయ్యి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి సమయంలో ఎటువంటి చిట్కాలు పాటించాలి అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…వర్షాకాలంలో పాదాలు చాలావరకూ తేమగా ఉంటాయి. అలా కాకుండా వాటిని కడిగిన వెంటనే తుడవడం చేయాలి. అలానే తడిగా ఉంటే పగిలే అవకాశం ఉంటుంది. చాలా మంది షూ వాడుతుంటారు. అయితే, వర్షాకాలంలో బ్రీథెబుల్ షూలు వాడాలి.

లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్రీథెబుల్ అయితే, పాదాలకి కాస్తా ఉపశమనంగా ఉంటుంది. వర్షాకాలంలో చేసే అతిపెద్ద పొరపాటు తడి బూట్లు వేసుకోవడం. చెప్పులు అయినా, బూట్లు అయినా తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు యాంటీ ఫంగల్ పౌడర్ వాడడం కూడా మంచిది. దీని వల్ల పాదాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. కాళ్ళకి మాయిశ్చరైజర్ రాయడం కూడా ముఖ్యమే. దీని వల్ల తేమ ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయి. చాలా మంది గోర్లు పెంచుకుంటారు. అలా కాకుండా వర్షాకాలంలో ఎప్పటికప్పుడు కట్ చేయించుకోవాలి. గాలి గోర్లు పెద్దగా ఉంటే అందులో ధూళి, దుమ్ము చేరడమే కాకుండా నొప్పిని కలిగించే అవకాశం ఉంది.

కాబట్టి, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయించుకోవడం మంచిది. పాదాల పగుళ్ళతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టి ఆ తర్వాత వాజిలెన్ రాయడం మంచిది. దీని వల్ల పాదాల పగుళ్ళు తగ్గుతాయి. చాలా మంది చెప్పులు, షూలు లేకుండా నడుస్తారు. ఇలా చేయడం వల్ల బురద అంటుకుని పాదాలు పగులుతుంటాయి. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా, ఎప్పటికప్పుడు పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువగా నీటిలో లేకుండా చూసుకోవాలి. వీటితో పాటు బయటికి వెళ్ళొచ్చాక కూడా కచ్చితంగా పాదాలని కడగాలని గుర్తుపెట్టుకోండి. రోజూ రాత్రిపూట పాదాలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి వాటికి వాజిలెన్ రాయడం వంటివి చేయాలి.