Site icon HashtagU Telugu

Melasma: ఈ పొడిలో పాలు కలిపి ప్యాక్ వేస్తే చాలు.. మంగు మచ్చలు మాయం అవ్వాల్సిందే?

Mixcollage 25 Feb 2024 05 31 Pm 3999

Mixcollage 25 Feb 2024 05 31 Pm 3999

మామూలుగా చాలా మందికి ముఖంపై మంగు వచ్చి ముఖం అంతా కూడా అందేహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఒక రకంగా ఉంటే మరికొందరికి ముఖం అంతా వ్యాపించి ఉంటుంది. అయితే ముఖం పై మంగు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడం వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ మంగు సమస్య అన్నది పోదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మన తెలుసుకుందాం.. ముఖంపై మచ్చలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అతినీలలోహిత కిరణాల ప్రభావంతో చర్మంపై మచ్చలు వస్తాయి.

మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా వచ్చినా మచ్చలు వస్తాయి. కేవలం ముఖంపై మాత్రమే కాకుండా కాళ్ళు, చేతులపై కూడా వస్తాయి. థైరాయిడ్, ఈస్ట్రోజన్ సహా హార్మోన్ల సమస్యల కారణంగా కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. లివర్‌లో వ్యర్థాలు ఏర్పడితే ఈ సమస్య వస్తుంది. మెలనిన్‌ని తగ్గించే రోజ్ పెటల్ ఫేస్ ప్యాక్. తరచూ అప్లై చేయాలి. చర్మానికి హాని కలిగించే UV కిరణాల ప్రభావాన్ని తగ్గించే గుణం నిమ్మరసానికి ఉంది. ఈ నిమ్మరసాన్ని చర్మానికి రాసినా, రోజూ ఈ జ్యూస్‌ని తాగినా మంగు మచ్చలు తగ్గుతాయి. ములేటి.. దీనినే అతి మధురం అని కూడా అంటారు. దీనిని వాడడం వల్ల ముఖంపై వచ్చిన మచ్చలు తగ్గుతాయి.

ఇందుకోసం ములేటిని పొడిని అరచెంచా పరిమాణంలో తీసుకుని అందులో ఆవుపాలు వేసి పేస్టులా చేయాలి. ముఖాన్ని కడిగి ఆరిన తర్వాత ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది. అదే విధంగా, టమాటరసం కూడా ఇలాంటి మచ్చల్ని తగ్గిస్తుంది. ఇందుకోసం టమాటల్ని జ్యూస్‌లా చేసి కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలిపి ఉప్పు, మిరియాల పొడి వేసి తాగాలి. దీని వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గుతాయి. అదే విధంగా, టమాట జ్యూస్‌ని ముఖానికి అప్లై చేసినా ఫలితం ఉంటుంది. అదే విధంగా, ఇంట్లోనే తయారు చేసిన క్రీమ్స్, ప్యాక్స్‌ని కూడా మంచి రిజల్ట్ ఉంటాయి. కాబట్టి, వాటిని ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.

Exit mobile version