Bottle Gourd: ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వారి పనులు కూడా వారు చేసుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే అలాంటి వారికి సొరకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి సొరకాయతో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సొరకాయలో ఇందులో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. బాడీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉడటం వల్ల కాస్త తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి తగ్గిపోతుందట. ఈ విధంగా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు. జ్యూస్ లతో పాటు సూప్స్, సలాడ్స్ సొరకాయను కలుపుకుని తీసుకోవచ్చట. సరైన విధంగా వండుకుంటే ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందట.
అదేవిధంగా బరువు తగ్గడంలో సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వెయిట్ మేనేజ్ మెంట్ కి ఇవి చాలా అవసరం. ఎక్కువ కేలరీలు డైట్ లో చేర్చకుండానే అన్ని రకాల న్యూట్రియెంట్స్ శరీరానికి అందాలంటే సొరకాయ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. సొరకాయను ఎలా తీసుకోవచ్చు అన్న విషయానికొస్తే.. చాలా మంది కూరలా చేసుకుని తింటారు. అయితే సొరకాయను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చట.
బరువు తగ్గాలనుకునే వారు ఉదయమే సొరకాయ జ్యూస్ చేసుకుని పరగడుపున తాగితే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారని చెబుతున్నారు. ఇలా ఉదయమే సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందట. తద్వారా బరువు తగ్గేందుకు వీలుంటుందని, ఈ జ్యూస్ నేచురల్ డిటాక్సిఫైయర్ లా పని చేస్తుందని, మెటబాలిజం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. కాగా తరచుగా సొరకాయ జ్యూస్ తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండవచ్చట. ఇక జ్యూస్ తో పాటు సూప్స్ రూపంలో కూడా తీసుకోవచ్చని, కూర కూడా చేసుకోవచ్చని, కూర రూపంలో తీసుకుంటే చాలా బెటర్ అని ఇందులో కొత్తిమీర, పుదీన, కరివేపాకు లాంటి వాటిని కలుపుకోవడం ద్వారా ఫ్లేవర్ పెరుగుతుందని, కానీ కేలరీలు మాత్రం అలాగే ఉంటాయని చెబుతున్నారు.
Bottle Gourd: అధికబరువుతో బాధపడుతున్నారా.. అయితే సొరకాయతో ఇలా చేయాల్సిందే!

Bottle Gourd