మనలో చాలామందికి ముఖంపై నల్లటి మచ్చల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నల్లటి మచ్చలు ఏర్పడడానికి అనే కారణాలు ఉన్నాయి. వాటిని నివారించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా. అయితే తేనెతో కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మచ్చలను నివారించడానికి సహాయపడే వాటిలో తేనె ఒకటి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు తోడ్పడతాయట.
తేనె నల్ల మచ్చలు, మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుందని,మన చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చడానికి, మీ ముఖం మెరిసేలా చేయడానికి ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు. మరి ఆ ఫేస్ ప్యాక్ లు ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. రెండు టీస్పూన్ల పెరుగును తీసుకుని అందులో ఒక టీస్పూన్ బియ్యప్పిండిని వేసి కలపాలి. ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు, తేనెను వేసి కలిపి,ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి,15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయట.
అదేవిధంగా రెండు టూ స్పూన్ల తేనెను తీసుకొని అందులో నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలట. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు బాగా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే నల్లటి మచ్చలు దూరం అవుతాయని చెబుతున్నారు.
అలాగే అర చెంచా తేనెను తీసుకొని అందులో అరకప్పు బొప్పాయి రసం వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలట.
అదేవిధంగా రెండు టీస్పూన్ల తేనెలో ఒక టీస్పూన్ కాఫీ, అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపి, తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలట. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలని, ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలను నివారించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఒక టీస్పూన్ ఆలివ్ నూనెలో అర టీస్పూన్ తేనె వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలట. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చర్మానికి చాలా మంచిదని చెబుతున్నారు.